శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Jan 08, 2021 , 01:04:32

చీడపీడల నివారణకు సస్యరక్షణ చర్యలు

చీడపీడల నివారణకు సస్యరక్షణ చర్యలు

దామెర, జనవరి 7: పంటల్లో వచ్చే చీడపీడల నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని వరంగల్‌ వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ జీ స్వాతి, డాక్టర్‌ సంతోష్‌కుమార్‌, డాక్టర్‌ హారిక సూచించారు. గురువారం దామెరలో పలువురి రైతుల పంటపొలాలను వారు పరిశీలించా రు. నారుమళ్లు,  వేరుశనగ, కాకరకాయ పంటల్లో వచ్చే తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో నువ్వులు విత్తుకుని అతితక్కువ సమయంలో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. వ్యవసాయ పరిశోధనా స్థానం జగిత్యాల నుంచి విడుదలైన కొత్త నువ్వులు రకం జేసీఎస్‌-1020, శ్వేత రకం విత్తనాలను మదన్‌రావు, కొమురయ్య అనే రైతులకు క్షేత్ర పరిశీలన కోసం ఇచ్చామన్నారు. శ్వేత రకం వేసవిలో అధిక దిగుబడినిస్తూ కాండం కుళ్లును తట్టుకుంటుందన్నారు.  జేసీఎస్‌-1020 కొత్తరకం బూడిద తెగులును తట్టుకుంటూ జతకాత కలిగి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏవో కమలాకర్‌ పాల్గొన్నారు.


logo