శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Jan 07, 2021 , 02:54:36

రెండు రోజుల్లో ఎస్సారెస్పీ నీటి విడుదల

రెండు రోజుల్లో ఎస్సారెస్పీ నీటి విడుదల

  • పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల, జనవరి 6 : మరో రెండు రోజుల్లో ఎస్సారెస్పీ ద్వారా నియోజకవర్గంలోని ఆత్మకూరు, పరకాల, నడికూడ మండలాలకు సాగు నీరు అందనున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఆరెపల్లి శివారులోని ఎప్సారెస్పీ డీబీఎం 31 ద్వారా నీటిని విడుదల చేయాలని బుధవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో సంవత్సరం పొడువునా గోదావరి జలాలు అందుబాటులో ఉంటున్నాయన్నారు. దీంతో వ్యవసాయం పండుగలా సాగుతోందన్నారు. రానున్న రోజుల్లో అవసరమైతే మూడో పంట సాగుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రైతులు యాసింగి సాగుకు సిద్ధం కావాలని సూచించారు.