గురువారం 21 జనవరి 2021
Warangal-rural - Jan 07, 2021 , 02:52:48

నర్సంపేటలో క్షీర విప్లవం రావాలి

నర్సంపేటలో క్షీర విప్లవం రావాలి

  • ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

ఖానాపురం, జనవరి 6 : నర్సంపేటలో క్షీర విప్లవం రావాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పశువైద్యశాల ఆవరణలో విజయ డెయిరీ, పశువైద్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో మెగా పశువైద్యశిబిరం, దూడల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 650 మంది దళితులకు నాలుగు గేదెల చొప్పున పంపిణీ చేసినట్లు తెలిపారు.  పశుసంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం విజయ డెయిరీకి పాలు పోస్తున్న వారిని సన్మానించారు. కార్యక్రమంలో విజయడెయిరీ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రదీప్‌, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జాకీర్‌ అలీ, జిల్లా అధికారి రవికుమార్‌, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, వైద్యులు శ్రీలక్ష్మి, శ్రీధర్‌వర్మ, రామ్మోహన్‌, వెంకన్న, రమేశ్‌, రవీందర్‌, మంగీలాల్‌, సురేశ్‌, భగీరథి, సర్పంచ్‌లు శాఖమూరి చిరంజీవి, భాషబోయిన ఐలయ్య, పాల ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు పరుచూరి నరేంద్ర, ఎంపీటీసీ కవిత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఉపసర్పంచ్‌ మేడిద కుమార్‌ పాల్గొన్నారు.

ఓపెన్‌ స్కూల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ 

నర్సంపేట : మధ్యలో చదువు మానేసిన వారికి ఓపెన్‌స్కూల్‌ ఓ వరంలాంటిదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నా రు. నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఓపెన్‌స్కూల్‌ ఇన్‌చార్జి శంకరయ్య ఆధ్వర్యంలో ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల వాల్‌పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ చదువు మానేసిన వారు దూరవిద్యను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ మాట్లాడుతూ ఓపెన్‌ స్కూల్‌లో అడ్మిషన్‌ పొందాలనుకునే వారు ఈ నెల 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో  హెచ్‌ఎం పీ కుమారస్వామి, అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ పోతుగంటి కుమారస్వామి, జీజేసీ కోఆర్డినేటర్‌ వెంకటయ్య, రాజిరెడ్డి పాల్గొన్నారు. logo