నాలుగు వైన్ షాపులు సీజ్

- 9 మందిపై చీటింగ్ కేసు నమోదు
వర్ధన్నపేట, జనవరి 6: లైసెన్స్ ఫీజులు చెల్లించకుండానే తప్పుడు చలాన్లు సృష్టించిన సంఘటనలో వర్ధన్నపేట ఎక్సైజ్ పరిధిలోని నాలుగు వైన్‌షాపులను అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఎక్సైజ్ సీఐ కరుణశ్రీ కథనం ప్రకారం.. వర్ధన్నపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని వర్ధన్నపేట పట్టణానికి చెందిన చంద్రమౌళి వైన్స్, తులసీ వైన్స్, ఇల్లెంద గ్రామంలోని మల్లికార్జున వైన్స్, అన్నారంలోని నందిని వైన్స్ నిర్వాహకులు బ్యాంకుల్లో షాపుల రెన్యూవల్‌కు సంబంధించిన డబ్బులు చెల్లించకుండా తప్పుడు చలాన్లను అధికారులకు అందజేశారు. ఎక్సైజ్‌శాఖ ఖాతాలో డబ్బులు జమకాకపోవడంతో విషయాన్ని గత నెల 28న అధికారులు గుర్తించారు. దీంతో సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు సీఐ కరుణశ్రీ ప్రాథమికంగా విచారణ జరిపి మంగళవారం రాత్రి వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ సీఐ కరుణశ్రీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు నాలుగు వైన్ షాపులను సీజ్ చేశారు. విచారణ తరువాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు షాపులను ఓపెన్ చేయిస్తామన్నారు.
తాజావార్తలు
- పాఠశాల పరిసరాలను శుభ్రం చేయాలి
- సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
- తల్లీబిడ్డల సంక్షేమం కోసమే మాతా శిశు దవాఖాన
- మార్క్‌ఫెడ్ ఫెడరేషన్ ఎండీగా యాదిరెడ్డి
- రామాలయ నిర్మాణానికి రూ. 5 లక్షల విరాళం
- బెస్ట్ ఎలక్టోరల్ అధికారిగా కలెక్టర్ నారాయణరెడ్డి
- మనసున్న మారాజు... ‘రిజర్వేషన్'పై హర్షం
- నేతాజీ జీవితం స్ఫూర్తిదాయకం
- పసుపు రైతు ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి
- గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి