అందాల ముద్దుగుమ్మలు సైతం వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అష్టకష్టాలు పడుతున్నారు. సమంత .. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కోసం ఎంత కష్టపడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ తన తజా చిత్రం కోసం బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంది.
చేతులకు బాక్సింగ్ గ్లౌజెస్ ధరించి ఫుల్ ప్రాక్టీస్ చేస్తుంది. తన బాక్సింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోని ఐశ్వర్యరాజేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఈ అమ్మడి కమిట్మెంట్కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన “అయ్యప్పనుమ్ కోషియం” సినిమాలోను ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది.