శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Jan 06, 2021 , 01:13:41

కష్టపడి పని చేసేవారికే పార్టీలో గుర్తింపు

కష్టపడి పని చేసేవారికే పార్టీలో గుర్తింపు

సంగెం, జనవరి 5: పార్టీకోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే వారికే తగిన గుర్తింపు ఉంటుందని టీఆర్‌ఎస్‌ మండ ల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి అన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని మొండ్రాయి, గొల్లపల్లి, ము మ్మిడివరం గ్రామాల్లో మంగళవారం పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ కందకట్ల నరహరి, మార్కెట్‌ డైరెక్టర్‌ దోపతి సమ్మయ్య యాదవ్‌, వైస్‌ ఎంపీపీ బుక్క మల్లయ్య, మాజీ ఎంపీపీ వీరాచారి, గుగులోత్‌ గోపీసింగ్‌, గోవర్దన్‌గౌడ్‌, కిశోర్‌యాదవ్‌, ఉండీల రాజు, మన్సూర్‌ అలి, సర్పంచ్‌లు గూడ కుమారస్వామి, మేరుగు మల్లేశం, ఇజ్జగిరి స్వప్నఅశోక్‌, ఎంపీటీసీ కొనకటి రాణి, అనుముల ప్రతాప్‌, స్వామి, కొనకటి మొగిలి, బుచ్చిబాబు, సంపత్‌, అశోక్‌ పాల్గొన్నారు.


logo