శుక్రవారం 15 జనవరి 2021
Warangal-rural - Jan 05, 2021 , 01:12:38

పల్లెల్లో ప్రకృతి అందాలు

పల్లెల్లో ప్రకృతి అందాలు

  • ఊరూరా పల్లె ప్రకృతి వనాలు
  • సేద తీరుతున్న జనాలు

సంగెం, జనవరి 4 : తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో పార్కులను ఏర్పాటు చేసేందుకు నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామానికి పల్లెప్రకృతి వనాలు (విలేజీ పార్కులు) ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. మండలంలో గతంలో 24 గ్రామపంచాయతీలు ఉండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ గూడేలను, తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అదనంగా 9 గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. దీంతో మండలంలో గ్రామపంచాయతీల సంఖ్య 33కు చేరింది.  మండలంలోని గవిచర్ల పల్లెప్రకృతి వనాన్నిమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. 

రకరకాల పూల చెట్లు

పల్లె ప్రకృతి వనంలో రకరకాల పూల చెట్లు పెంచుతున్నారు. ఇందులో వాకింగ్‌ చేయడానికి వీలుగా ట్రాక్‌ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కాసేపు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయడంతో పల్లె పార్కులు పట్టణంలోని పార్కులను తలపిస్తున్నాయి. 

నియోజకవర్గంలోనే పెద్ద పార్కు

బాలునాయక్‌తండా నూతన గ్రామపంచాయతీగా ఏర్పడింది. ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం నియోజకవర్గంలోనే పెద్దది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దీనిని ప్రారంభించారు. ఎకరంన్నర భూమి లో ఏర్పాటు చేసిన పార్కులో 34 రకాల మొక్కలు నాటారు. మూడు వాకింగ్‌ ట్రాక్‌ లు, కూర్చోవడానికి కుర్చీలు ఉన్నాయి.  

పార్కు బాగున్నది : అజ్మీర రవి, 

తండాలో ఏర్పాటు చేసి న విలేజ్‌ పార్కు బా గుంది. సీఎం కేసీఆర్‌ సారు మాలాంటి గిరిజనులు ఉం డే మారుమూల ప్రాంతా ల్లో  పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉన్నది.  ఎప్పుడు వరంగల్‌ వెళ్లినా హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌కు వెళ్లేటోళ్లం. అలాంటి పార్కు మా ఇంటి వద్దనే ఏర్పాటు చేయటం సంతోషంగా ఉన్నది. 

నల్లబెల్లి: జనవరి 4: పల్లె ప్రగతి పనులతో పల్లెలు పులకరిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో పల్లెలు పచ్చ దనాన్ని సంతరించుకుని ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నల్లబెల్లి మండలంలోని 29 గ్రామపంచాయతీల్లో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. 

మంకీ ఫుడ్‌ కోర్టు 

వనం వీడి జనంలోకి వచ్చిన కోతులను తిరిగి వనంలోకి పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొదట యాదాద్రిలో మంకీఫుడ్‌ కోర్టు ఏర్పాటు చేసి ఫలితం సాధించింది. ఇందులో భాగంగానే మండలంలోని బుచ్చిరెడ్డిపల్లెతో పాటు మూడుచెక్కలపల్లి గ్రామాల్లోనూ ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ పార్కుల్లో రకరకాల పండ్ల మొక్కలు నాటారు. 

 వంద శాతం పనుల పూర్తికి కృషి 

 -తంగెళ్ల నిర్మల, సర్పంచ్‌ 

తెలంగాణ ప్రభుత్వం మంజూరి చేస్తున్న సంక్షేమ పథకాల ను అధికారుల సలహాలు, సూచనలతో వందశాతం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. హరితహారంలో భాగంగా గ్రా మాన్ని పచ్చదనంతో నింపేలా మొక్కలు నాటి ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నాం. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణంలో కన్నారావుపేట జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది.