రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం

చెన్నారావుపేట, జనవరి 3 : రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం చెందిన సంఘటన మండలంలోని లింగగిరి శివారులో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. సంగెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన బర్ల మహేశ్(32) నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం రాత్రి విధుల్లో భాగంగా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి వెళ్లి తిరిగి నర్సంపేటకు వస్తుండగా బైక్ అదుపు తప్పి లింగగిరి శివారులోని మలుపు వద్ద రోడ్డు పక్కన పడిపోయాడు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య అనూష, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి తండ్రి బర్ల వీరస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శీలం రవి తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న ఏసీపీ ఫణీందర్, నెక్కొండ సీఐ పుప్పాల తిరుమల్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే, అంత్యక్రియల్లో పాల్గొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
గాయపడిన వ్యక్తి మృతి
చెన్నారావుపేట : రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామానికి చెందిన మాసాని శోభన్ ద్విచక్రవాహనంపై గురువారం రాత్రి నర్సంపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా రామన్నకుంటతండా వద్దకు రాగానే ఎదురెదురుగా మరో బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో శోభన్‌కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు 108లో నర్సంపేట ఏరియా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు పంపారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి అన్న భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శీలం రవి తెలిపారు.
తాజావార్తలు
- 'రాహుల్‌గాంధీ మీకు అబద్దాలు చెప్పడానికి సిగ్గనిపించదా..?'
- సీబీఐకి ఊమెన్ చాందీపై లైంగిక దాడి కేసు
- డీఆర్డీవోలో అప్రెంటిస్‌లు
- రెండేళ్ల కూతురికి జడ చిక్కులు తీసిన హీరో
- హ్యాపీ బర్త్ డే పుజారా..
- దేశంలో ఊబకాయులు పెరుగుతున్నారు..
- హైదరాబాద్ నవాబు వారసత్వం కేసును తేల్చండి : సుప్రీం
- ఇదోరకం కల్లు..!
- వచ్చే ఏడాది నౌకాదళం అమ్ములపొదిలోకి INS విక్రాంత్!
- వాట్సాప్ ప్రైవసీ పాలసీ : కేంద్రం ఫైర్