ప్రమాదకరంగా..లోలెవల్ కాజ్వే

- శిథిలావస్థకు చేరిన వైనం
- పట్టించుకోని ఆర్అండ్బీ అధికారులు
నర్సంపేట రూరల్, జనవరి 2: నెక్కొండ, చెన్నారావుపేట మండలాల నుంచి నర్సంపేటకు వెళ్లే ప్రధాన రహదారిలో పాతముగ్ధుంపురం శివారులో ఉన్న లోలెవల్ కాజ్వే ప్రమాదకరంగా మారింది. 60 ఏళ్ల క్రితం రోడ్డు వేసినప్పుడు నిర్మించిన ఈ కాజ్వే ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. కాజ్వే పైనుంచి భారీ లోడ్‌తో ఓ వాహనం వెళ్లడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఎప్పుడు కూలిపోతుందోననే భయంతో నిత్యం వాహనచోదకులు, ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాజ్వే పైనుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ప్రధాన రహదారి గుండా నర్సంపేట నుంచి నెక్కొండ, తొర్రూరుకు నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. అంతేకాకుండా నిత్యం పదుల సంఖ్యలో అధిక లోడ్‌లో భారీ లారీలు సైతం వెళ్తుంటాయి. ఈ క్రమంలో ఆటోలు, ద్విచక్ర వాహనాలు, లారీలు, కార్లు చాలాసార్లు ప్రమాదాలకు గురికాగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలంలో ముగ్ధుంపురం ఊర చెరువు మత్తడి పోస్తే ఈ కాజ్వే పైనుంచి ప్రవహిస్తుంటుంది. దీంతో రాకపోకలు స్తంభిస్తాయి. గత ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు కాజ్‌వేపై వెళ్లిన ఓ రెడ్‌మిక్స్ ట్యాంకర్ వరదలో చిక్కుకుంది. అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇక రాత్రి వేళల్లో ఈ రహదారి గుండా ప్రయాణం సాగించాలంటే భయమేస్తుందని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్అండ్బీ అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నూతన లోలెవల్ కాజ్‌వేను నిర్మించాలని ప్రజలు, ప్రయాణికులు, వాహనచోదకులు కోరుతున్నారు.
నూతన కాజ్వే నిర్మించాలి
అరవై ఏళ్ల క్రితం రోడ్డు నిర్మించినప్పుడు ఏర్పాటు చేసిన లోలెవల్ కాజ్వే ఇది. ఈ కాజ్వే శిథిలావస్థకు చేరడంతో పైపెచ్చులు ఊడిపోయాయి. వర్షాకాలంలో ఈ రహదారిపై నుంచి వాహనాలు వెళ్లలేని పరిస్థితి. వెంటనే ఆర్అండ్బీ అధికారులు స్పందించి నూతన కాజ్‌వేను నిర్మించాలి.
- సుంకరి లావణ్య, పాతముగ్ధుంపురం సర్పంచ్
తాజావార్తలు
- జగత్ విఖ్యాత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దు
- పునర్జన్మలపై నమ్మకమే మదనపల్లి హత్యలకు కారణం !
- అధికార పార్టీకి దురుద్దేశాలు అంటగడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
- పార్లమెంట్ మార్చ్ వాయిదా : బీకేయూ (ఆర్)
- ఢిల్లీ సరిహద్దులో గుడారాలు తొలగిస్తున్న రైతులు
- హెచ్-1 బీ నిపుణులకు గ్రీన్ కార్డ్.. షార్ట్‌కట్ రూటిదే?!
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి : మంత్రి మల్లారెడ్డి
- ఇద్దరు గ్రామస్తులను హతమార్చిన మావోయిస్టులు
- రేపు ఏపీ గవర్నర్‌ను కలవనున్న బీజేపీ, జనసేన బృందం
- పవన్ కళ్యాణ్‌కు చిరు సపోర్ట్..జనసేన నేత కీలక వ్యాఖ్యలు