సోమవారం 18 జనవరి 2021
Warangal-rural - Jan 02, 2021 , 01:55:26

కేకు తెచ్చేందుకు వెళ్లి..

కేకు తెచ్చేందుకు వెళ్లి..

  • రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల దుర్మరణం
  • మరొకరికి తీవ్ర గాయాలు n ‘న్యూ ఇయర్‌' వేడుకల్లో విషాదం
  • రాయపర్తి మండల కేంద్రంలో ఘటన        

రాయపర్తి, జనవరి 1 : న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకునేందుకు కేక్‌ కోసం వెళ్లిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చేతికందిన కొడుకులు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ ఘటన మండల కేంద్రం లో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ (అంబేడ్కర్‌ నగర్‌)కి చెందిన ఐత సువర్ణ-బాబు దంపతులకు ఐత  శ్రీకాంత్‌ (21), ఐత శ్రీశాంత్‌ (18) అనే ఇద్దరు కు మారులున్నారు. సువర్ణ కూలీ పని చేస్తుండగా బాబు తాపీ మేస్త్రీగా పని చేస్తూ ఇద్దరు కుమారులను పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడు శ్రీకాంత్‌ ఇటీవల బీటెక్‌ పూర్తి చేయగా, చిన్న కుమారుడు శ్రీశాంత్‌ ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 

కేక్‌ తీసుకొని వస్తుండగా...

గురువారం రాత్రి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు మిత్రులతో కలిసి ఏర్పాట్లు చేసుకున్నారు. కేక్‌ కోసం అన్నదమ్ములిద్దరు కలిసి మండల కేంద్రంలోని బస్టాండ్‌ సెంటర్‌కు వెళ్లగా ఐత రేవంత్‌ అలియాస్‌ గూడపల్లి రేవంత్‌ కలిశాడు. అర్ధరాత్రి అవుతుండడంతో బస్టాండ్‌ సెంటర్‌లో కేక్‌ షాపు మూసి ఉంది. దీంతో ఎలాగైనా కేక్‌ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అయిత రేవంత్‌ను తీసుకుని అన్నదమ్ములిద్దరూ వర్ధన్నపేటకు ద్విచక్ర వాహనం పై వెళ్లారు. కేక్‌ కొనుగోలు చేసి తిరిగి రాయపర్తికి వస్తున్న క్రమంలో వర్ధన్నపేట మండలం నీలగిరి స్వామి తండా దాటి రాయపర్తి శివారుకు చేరుకోగా నే వాహనం అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రీకాంత్‌, శ్రీశాం త్‌ తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన రేవంత్‌ యాక్సిడెంట్‌ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకు ని రేవంత్‌ను హన్మకొండలోని ప్రైవే ట్‌ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ట్లు వైద్యులు తెలిపారని కుటుం బ సభ్యులు చెప్పారు.

ఎటువెళ్లినా కలిసే...

ఐత సువర్ణ-బాబు దంపతుల కుమారులు శ్రీకాంత్‌ (21), శ్రీశాంత్‌ (18) ఇద్దరు చిన్నప్పటి నుంచి ఎటు వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లే వారు. వీరిని చూసి కాలనీవాసులు ఆనంద పడేవారు. అన్నదమ్ములంటే ఇలా ఉండాలని ఉదహరించేవారు. ఒకే రోజు అన్నదమ్ములిద్దరూ మృతి చెందడంతో కాలనీవాసులు, స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేతికొచ్చిన కొడుకులు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు బోరున విలపించా రు. ‘మమ్ములను ఒంటరి వాళ్లుగా చేసి వెళ్లి పోయారా? బిడ్డా’ అని తల్లి ఏడ్చిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.