శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Jan 02, 2021 , 01:50:05

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

  • వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ 

వర్ధన్నపేట, జనవరి 1 : ప్రజలకు మరింతగా చేరువవుతూ సమస్యలను పరిష్కరించే విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులు, పార్టీ బాధ్యులతో శుక్రవారం వర్ధన్నపేట క్యాంపు కార్యాలయంలో తూళ్ల కుమారస్వామి అధ్యక్షతన సమన్వయ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో సమస్యలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం వారంలో రోజుకో మండలానికి సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు  ప్రజాప్రతినిధులు, నాయకులు సహకరించాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీలు మార్గం భిక్షపతి,  సింగ్‌లాల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజేశ్‌ఖన్నా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అరుణ, వైస్‌ చైర్మన్‌ ఎలేందర్‌రెడ్డి, రైతు బంధు సమితి కన్వీనర్‌ మోహన్‌రావు,  చొప్పరి సోమయ్య, మైనార్టీ నాయకుడు ఎండీ రహీం పాల్గొన్నారు. 

క్యాలెండర్‌ ఆవిష్కరణ

భీమారం : కొత్త సంవత్సరంలో విలీన గ్రామాల అభివృద్ధికి  కృషిచేస్తాని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. గ్రేటర్‌లోని ఎమ్మెల్యే రమేశ్‌ స్వగృహంలో 55వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు గడ్డం శివరాం ప్రసాద్‌ ఆధ్వర్యంలో రూపొందించిన 2021 క్యాలెండర్‌ను  శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  విలీన గ్రామాల అభివృద్ధికి ప్రణాళికతో పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో 57,58వ డివిజన్‌ కార్పొరేటర్లు జక్కుల వెంకటేశ్వర్లు, బానోత్‌ కల్పన, జడ్పీటీసీ  ఏనుమాముల మార్కెట్‌ డైరెక్టర్‌ విజయ్‌, వంగపహాడ్‌ పీఏసీఎస్‌  చైర్మన్‌ మేరుగు రాజేశ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్‌ రెడ్డి, గండు అశోక్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి ఏరుకొండ శ్రీనివాస్‌, నాయకులు బొమ్మగాని వెంకటేశ్‌, మంద భాస్కర్‌, గోపినాథ్‌, సంగాల థామస్‌, చెట్టపల్లి అక్షయ్‌కుమార్‌, దోమల శ్రీనివాస్‌, నాగరాజు, దామెర సాగర్‌, గందె రాజు, తోట నాగరాజు, ప్రశాంత్‌, శంకర్‌ పాల్గొన్నారు.

12వ డివిజన్‌లో...

కాశీబుగ్గ : గ్రేటర్‌ 12వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి గండ్రాతి భాస్కర్‌ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఎమ్మెల్యే అరూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌ అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ తూర్పాటి సులోచన, డివిజన్‌ అధ్యక్షుడు ముడుసు నరసింహ, జంగం రాజు, ఎండీ సలీం, కేతిరి రాజశేఖర్‌, కొత్తపెల్లి అనిల్‌, కేతిరి రాజశేఖర్‌, పసులాది మల్లయ్య, గంధం గోవింద్‌, పత్రి సుభాష్‌, సిలువేరు శ్రీనివాస్‌, ఆజాం, జావీద్‌, యాకుబ్‌, మహబూబ్‌పాషా, గండ్రాతి నవీన్‌, ఐలి రాములు పాల్గొన్నారు.