పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

- నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట, జనవరి 1 : తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం నర్సంపేటలోని ఎన్టీఆర్ నగర్లో శాలివాహన సంఘం కమ్యూనిటీ హాల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదన్నారు. కొన్నేళ్లుగా అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కుల సంఘాలకు ఉపయోగపడేలా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, బీరం సంజీవరెడ్డి, పాషా, పైడయ్య, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు శుభాకాంక్షల వెల్లువ
నూతన సంవత్సరం సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని అధికారులు, ప్రజాప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఏసీపీ ఫణీందర్, సీఐలు, ఎస్సైలు ఎమ్మెల్యేకు బొకే అందించి, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, నర్సంపేటలోని మదర్సా పిల్లలు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మదర్సా పిల్లలతో ఎమ్మెల్యే కేక్‌ను కట్ చేశారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.