ఆదివారం 24 జనవరి 2021
Warangal-rural - Jan 02, 2021 , 01:42:19

తాటిచెట్ల పైనుంచి పడిఇద్దరు గీత కార్మికుల మృతి

తాటిచెట్ల పైనుంచి పడిఇద్దరు గీత కార్మికుల మృతి

  • మరొకరికి తీవ్ర గాయాలు

రాయపర్తి, జనవరి 1 : తాటిచెట్టు పైనుంచి కింద పడి గీత కార్మికుడు మృతి చెందాడు. ఈఘటన శుక్రవారం మండలంలోని సన్నూరు గ్రామంలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుదగాని సాయిలుగౌడ్‌ (48) శుక్రవారం ఉదయం గ్రామ శివారులోని తాటి చెట్టు ఎక్కుతుండగా అదుపు తప్పి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సుగుణమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాగా, విషయం తెలుసుకున్న జడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సాయిలు మృతదేహానికి నివాళులర్పించారు. అదేవిధంగా మండల కేంద్రంలో మృతి చెందిన పల్లె ఎల్లాగౌడ్‌ మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఆయన వెంట సర్పంచ్‌లు నలమాస సారయ్య, లేతాకుల సుమతి, యాదవరెడ్డి, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 


logo