మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Jan 01, 2021 , 02:18:56

పెద్ద మనస్సుతో వేతనాల పెంపు

పెద్ద మనస్సుతో వేతనాల పెంపు

  • ఐకేపీ వీవోఏల హర్షం
  • ఊరూరా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు

పర్వతగిరి/నెక్కొండ/శాయంపేట/నర్సంపేట రూరల్‌, డిసెంబర్‌ 31: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్ద మనస్సుతో తమ వేతనాలు పెంచారని ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ) వీవోఏ అన్నారు. వేతనాలపై పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం ఊరూరా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. పర్వతగిరిలో జరిగిన కార్యక్రమంలో వీవోఏల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌ యాకస్వామి, మండల అధ్యక్షురాలు మిట్టపెల్లి రజిత, కార్యదర్శి బాల్లె కవిత, కోశాధికారి నాంపెల్లి రాజ్‌కుమార్‌, సహాయ కార్యదర్శి బోనాల రాజయ్య, ఏపీఎం తోటకూరి కృష్ణమూర్తి, సీసీలు రవీందర్‌రాజు, రమాదేవి, వర్కాల సుధాకర్‌, బాల్లె కాంతయ్య పాల్గొన్నారు. నెక్కొండలోని ఐకేపీ కార్యాలయ ఆవరణలో వీవోఏల సంఘం మండల అధ్యక్షుడు పోశాల యాకాంబ్రం, కార్యదర్శి బోనగిరి రాధిక, సభ్యులు రవి, శ్రీను, అనిత, రంజిత్‌, రజిత, ఉమ, శోభ, ఉపేందర్‌, సాగర్‌ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శాయంపేటలో వీవోఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగు విజయ, మండల గౌరవ అధ్యక్షుడు బత్తుల ప్రభాకర్‌, ఐకేపీ ఏపీఎం శ్రీధర్‌రెడ్డి, వీవోఏల సంఘం ఉపాధ్యక్షురాలు గాజుల స్వరూపారాణి, హైమావతి, నిర్మల, రమ్య, రాజేశ్వరి, రాజ్యలక్ష్మి, వసంత, శిరీష, శారద, సీసీలు విజయ్‌, జ్యోతి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నర్సంపేట పట్టణంలోని ఆదర్శ మండల సమాఖ్య కార్యాలయ ఆవరణలో  వీవోఏల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. సంఘం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, కార్యదర్శి శ్రీను, కోశాధికారి రాణి, ఆదర్శ మండల సమాఖ్య అధ్యక్షురాలు స్వేత, ఏపీఎం కుందేళ్ల మహేందర్‌, సీసీలు శోభ, యాకుబ్‌, మహేందర్‌, వనమ్మ పాల్గొన్నారు.