శుక్రవారం 15 జనవరి 2021
Warangal-rural - Dec 31, 2020 , 01:34:56

అన్నదాతల ఆత్మబంధువు కేసీఆర్‌

అన్నదాతల ఆత్మబంధువు కేసీఆర్‌

  • రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శం
  • వేదికలు రైతులకు భరోసా కేంద్రాలు
  • వ్యవసాయాన్ని పండుగ చేస్తున్న ఘనత సీఎందే
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • రాయపర్తి మండలంలో రూ. కోటి 57లక్షలతో 
  • అభివృద్ధి పనులు ప్రారంభం, శంకుస్థాపన

రాయపర్తి, డిసెంబర్‌ 30:  సీమాంధ్రుల వివక్షతో ఆదరణ లేక అరిగోసపడుతూ వ్యవసాయ రంగాన్ని పడావు పెట్టి.., పట్నాలకు వలస పోతున్న అన్నదాతలకు సీఎం కేసీఆర్‌ ఆత్మబంధువులా ఆదుకుంటున్నాడని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్‌ హరిత, జిల్లా, మండల స్థాయి అధికారులలు, ప్రతినిధులతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. మండలవ్యాప్తంగా రూ.కోటీ 57లక్షల 50 వేల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఆరు దశాబ్ధాల పాటు తెలంగాణ ప్రాంతం నిరాదరణకు గురైందన్నారు. సీమాంధ్ర పాలకులు ఇక్కడి వనరులను దోచుకోవడంతోపాటు రైతులను నిలువునా దోపిడి చేశారన్నారు. దీనిని గుర్తించిన కేసీఆర్‌ దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలకు మార్గదర్శకంగా నిలిచేలా ప్రజలు, రైతుల అభివృద్ధికి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా, పట్టాదారు పాస్‌  పుస్తకాల జారీ వంటి అంశాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలోని పలు క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతు వేదికలు రైతుల సంఘటితానికి వేదికలని అన్నారు. భవిష్యత్‌లో రైతు కుటుంబాలకు భరోసా కేంద్రాలుగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  

 ప్రకృతి వనాలతో పల్లెలకు పట్టణ శోభ...

 పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన వనాల నిర్మాణంతో మారుమూల గ్రామాలు, పల్లెలకు పట్టణ శోభ సంతరించుకోనశోభ సంతరించుకుంటున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గ్రామాలలో నిర్మితమైన పల్లె ప్రకృతి వనాలను గ్రామాల ప్రజలు వినియోగించుకుని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా ఆయన కోరారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ వర్ధన్నపేట అధ్యక్షుడు డాక్టర్‌ మల్లెల రంగారావు, ప్రతినిధి బిల్లా సుభాష్‌రెడ్డి మండలంలోని పలు రైతువేదికలకు ‘పోడియాలు’ అందజేయ నున్నట్లు ప్రకటించారు. కార్యక్రమాలలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్‌, మండల రైతుబందు కోఆర్డినేటర్‌ ఆకుల సురేందర్‌రావు, ఆర్‌డీవో సీహెచ్‌. మహేందర్‌జీ, డీఆర్‌ఢీవో మిట్టపల్లి సంపత్‌రావు, ఐబీ డీఈ శ్రావణ్‌కుమార్‌, రావి అమర్‌నాధ్‌చౌదరి, జేడీఏ ఉషాదయాల్‌, వర్ధన్నపేట ఏడీఏ అనిల్‌కుమార్‌, తహసీల్ధార్‌ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో కలికోట రాంమోహనాచారి, ఎమ్పీవో తుల రాంమోహన్‌, ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.