గురువారం 28 జనవరి 2021
Warangal-rural - Dec 30, 2020 , 00:29:12

రూరల్‌ జిల్లాయాసంగి ధాన్యం నిల్వల పరిశీలన!

రూరల్‌ జిల్లాయాసంగి ధాన్యం నిల్వల పరిశీలన!

  • సీఎంఆర్‌ గడువు పొడిగింపుపై ఎఫ్‌సీఐ నిర్ణయం
  • నేటి నుంచి రైస్‌మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్‌
  • ఎఫ్‌సీఐకి పౌరసరఫరాల శాఖ సహకారం
  • తేలనున్న ధాన్యం లెక్కలు
  • రైస్‌ ఇండస్ట్రీలో ఉత్కంఠ 

వరంగల్‌ రూరల్‌-నమస్తే తెలంగాణ: రైస్‌మిల్లుల్లో గత యాసంగి ధాన్యం నిల్వలను పరిశీలించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిర్ణయించింది. ఈ మేరకు ఫిజికల్‌ వెరిఫికేషన్‌ కోసం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎఫ్‌సీఐ అధికారులు బుధవారం నుంచి రైస్‌మిల్లుల్లో యాసంగి ధాన్యం నిల్వల పరిశీలనకు ప్రణాళిక రూపొందించారు. వీరికి సహకరించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు రెడీ అయ్యారు. 2019-20 యాసంగిలో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వం కస్టమ్‌ మిల్డ్‌ రైస్‌ (సీఎంఆర్‌) విధానంపై రైస్‌ మిల్లులకు కేటాయించింది. దీన్ని మర పట్టి డెలివరీ చేసేందుకు డిసెంబరు 31వరకు గడువు ఇవ్వగా గురువారంతో ముగిసిపోనుంది. రైస్‌మిల్లర్లు మాత్రం డెడ్‌లైన్‌ను అంతగా పట్టించుకోలేదు. 

లోని రైస్‌మిల్లర్లు 39 వేల టన్నుల సీఎంఆర్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో యాభై వేల టన్నుల సీఎంఆర్‌ను డెలివరీ చేయాల్సి ఉన్నట్లు తెలిసింది. ఇలా ప్రతి జిల్లాలో పెండింగ్‌ ఉండగా గడువు పొడిగించాలని రైస్‌మిల్లర్లు ప్రభుత్వాన్ని కోరారు. గడువు పొడిగింపునకు ఎఫ్‌సీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో గడువు పొడగింపు ప్రతిపాదన తమవద్దకు రావడంతో రైస్‌మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్‌ కోసం ఎఫ్‌సీఐ నిర్ణయించింది. ఎఫ్‌సీఐ తొలిసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషం. వారంలో రైస్‌మిల్లుల్లో యాసంగి ధాన్యం ఫిజికల్‌ వెరిఫికేషన్‌ చేసి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశిస్తూ సోమవారం కేంద్ర ప్రభుత్వ ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబూషన్‌ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు మూడు రోజుల పాటు రైస్‌మిల్లుల్లో యాసంగి నిల్వలపై ఫిజికల్‌ వెరిఫికేషన్‌కు సహకరించాలని తమ శాఖ అధికారులను ఆదేశిస్తూ మంగళవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నేటి నుంచి పరిశీలన కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి. రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి కూడా బృందం వెంట ఉంటారు. నిల్వల్లో తేడా ఉంటే ఎఫ్‌సీఐ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుండగా ఈ పరిణామంపై రైస్‌ ఇండస్ట్రీలో ఉత్కంఠ నెలకొంది.   logo