అభివృద్ధి పనులు వందశాతం పూర్తి చేయాలి

దుగ్గొండి, డిసెంబర్ 29: గ్రామాల్లో అభివృద్ధి పనులను వందశాతం పూర్తి చేయాలని డీఎల్పీవో వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని చలపర్తి, రేఖంపల్లిలో ఆయన సర్పంచ్‌లు, ఎంపీవోతో కలిసి డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల పనులను పరిశీలించారు. వారి వెంట సర్పంచ్‌లు ముదురుకోళ్ల శారదాకృష్ణ, ఇమ్మడి యుగేంధర్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, కార్యదర్శి సంతోష్, అశోక్‌రెడ్డి ఉన్నారు.
పనులను త్వరగా పూర్తి చేయాలి
నెక్కొండ: మండలంలో శ్మశాన వాటిక పనులను త్వరగా పూర్తి చేయాలని ఏపీడీ సాయిచరణ్, ఏపీవో జాకబ్ సూచించారు. ఆయన పెద్దకొర్పోలు, కస్నాతండా, నక్కలగుట్టతండాలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు పనులను పరిశీలించారు. కస్నాతండాలో శ్మశాన వాటిక, పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డు పనుల పురోగతిని సర్పంచ్ రవినాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పనులు పూర్తి చేసి డంపింగ్ యార్డును వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీటీసీ కవిత గోపీనాయక్, మడిపెల్లి సర్పంచ్ స్వాతి రమేశ్, కార్యదర్శి అరుణ్ ఉన్నారు.
పల్లె ప్రగతి పనులు భేష్
పర్వతగిరి: చింతనెక్కొండలో పల్లె ప్రగతి పనులను మండల ప్రత్యేకాధికారి పరమేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు బాగున్నాయని కితాబిచ్చారు. శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనంలో మొక్కలు చాలా బాగా ఉన్నాయని అభినందించారు. నర్సరీ పనులు, డంపింగ్ యార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట సర్పంచ్ గటిక సుష్మా, కార్యదర్శి కిశోర్‌కుమార్, ఉపసర్పంచ్ దర్నోజు దేవేందర్, విద్యా కమిటీ చైర్మన్ మహేశ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- పక్కా కుట్రతోనే ఢిల్లీలో హింస: దిగ్విజయ్ సింగ్
- బిహార్‌లో కలకలం : బీజేపీ నేతపై కాల్పులు
- వరల్డ్ నంబర్ వన్ చేతిలో ఓడిన సింధు
- రైతు ఆందోళనపై 22 ఎఫ్ఐఆర్లు : రైతు నాయకులపై కేసులు
- చిక్కుల్లో విరాట్ కోహ్లి.. కేరళ హైకోర్టు నోటీసులు
- ఛత్తీస్‌గఢ్‌లో 24 మంది నక్సలైట్ల లొంగుబాటు
- స్నానాల గదుల్లోకి దూరి.. యువతుల లోదుస్తులు చించి..
- వేటగాళ్ల ఉచ్చుకు పులి మృత్యువాత
- ఆన్లైన్ క్లాస్‌లో టీచర్‌ను బురుడీ కొట్టించిన స్టూడెంట్
- ఆచార్యకు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!