Warangal-rural
- Dec 30, 2020 , 00:29:18
‘రైతు బాంధవుడు సీఎం కేసీఆర్'

పరకాల : వ్యవసాయానికి పెట్టుబడి సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ అన్నారు. యాసంగి పంటకు గాను రైతుబంధు నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు పరకాలలో టీఆర్ఎస్ నా యకులతో కలిసి మంగళవారం ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రతి ఎకరాకు సాగు నీరు, నిరంతర విద్యుత్‌ను అందిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, రైతు బంధు సమితి పట్టణ కోఆర్డినేటర్ దగ్గు విజేందర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొచ్చు వినయ్, ఐఆర్సీఎస్ జిల్లా సభ్యుడు బండి సారంగపాణి, నాయకులు చందుపట్ల రమణారెడ్డి, పావుశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING