కరాటేతో ఆత్మరక్షణ

- రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న విద్యార్థులు
- ప్రోత్సహిస్తున్న క్రియేటివ్ కరాటే డూ క్లబ్
పరకాల : ఆత్మరక్షణతో పాటు శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయి. దీనిని తోడు విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించాలన్నా.., ఉద్యోగాలు పొందాలన్నా క్రీడలు తోడ్పడుతాయి. ఈ నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణానికి చెందిన పలువురు చిన్నారులు కరాటే పోటీల్లో ప్రతిభ చూపుతూ ఎన్నో పతకాలు సాధించారు.
క్రియేటివ్ కరాటే డూ క్లబ్ ఆధ్వర్యంలో ..
పట్టణానికి చెందిన మాడ సంపత్ క్రియేటివ్ కరాటే డూ క్లబ్‌ను 1992లో స్థాపించి విద్యార్థులకు ఉచితంగా కరాటేలో శిక్షణ ఇస్తున్నాడు. బీఎస్ఎన్ఎల్ భవన్ ఆవరణలో నిత్యం 50 మంది విద్యార్థులుకు శిక్షణ ఇస్తూ వారికి ఎన్నో మెళకువలు నేర్పిస్తున్నారు. మూడేళ్ల నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇస్తూ వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నారు. ఆత్మరక్షణకు కటాస్, స్పారింగ్, కుముటీ, నాన్చాక్, వెపన్ తదితర విభాగాల్లో మెళకువలు నేర్పిస్తున్నారు.
రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ
క్రియేటివ్ కరాటే డూ క్లబ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నమెంట్లో పాల్గొని మెడల్స్ సాధిస్తున్నారు. ప్రస్తుతం 60 మంది విద్యార్థులు చిన్నతనం నుంచి శిక్షణ పొందుతున్నారు. వీరిలో మాడ సాయిస్నిగ్దేశ్, ఎస్.అభినవ్, పోచంపల్లి కీర్త్, పొచంపల్లి రితిక, నిఖిల్, పీ సాయితేజ, బ్రౌన్‌బెల్ట్ విద్యార్థి ఏ. ఉమావైష్ణవి, కే సూర్య తేజ ఉన్నారు. వీరిలో సీనియర్ బ్లాక్ బెల్ట్ విద్యార్థి మాడ సాయి స్నిగ్ధేష్ తన ఏడో ఏట నుంచి శిక్షణ పొందుతుండగా ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని 80కి పైగా మెడల్స్ సాధించాడు.
కరాటే ఆత్మైస్థెర్యం పెరుగుతుంది.
కరాటేతో చిన్నారుల్లో ఆత్మైస్థెర్యం పెరుగుతుంది. విద్యార్థులు చదువుతో ఒత్తడికి గురవుతూ ఆటలకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిలో మానసిక, శారీరక సామర్ధ్యం తక్కువగా ఉన్నది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటలపై శ్రద్ధ చూపేలా పోత్సహించాలి. కరాటేతో విద్యార్థినులకూ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వారి ఆత్మరక్షణకు కరాటే ఉపయోగపడుతుంది.
- మాడ సంపత్, కరాటే మాస్టర్, క్రియేటివ్ క్లబ్
తాజావార్తలు
- బిగ్‌బీ వీడియోపై గీతా గోపీనాథ్ స్పందన
- బెల్లో టెక్నీషియన్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు
- అందరికీ సమాన అవకాశాలు : మంత్రి కేటీఆర్
- గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. !
- ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏంచేస్తోంది : పవన్ కల్యాణ్
- 15 రోజుల్లో పీవీ విజ్ఞాన వేదిక పనులు ప్రారంభం
- మేలో కాంగ్రెస్ ప్లీనరీ.. అప్పుడే కొత్త అధ్యక్షుడి ఎన్నిక
- బెంగాల్ మంత్రి రాజీవ్ బెనర్జి రాజీనామా
- మా సెర్చ్ ఇంజిన్‌ను ఆపేస్తాం.. గూగుల్ హెచ్చరిక
- డార్క్ వెబ్‌లో కీలక డేటా