రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

- రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు చింతిరెడ్డి సాంబరెడ్డి
పరకాల: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో వ్యవసాయం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు చింతిరెడ్డి సాంబరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని నాగారంలో ఆదివారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆముదాలపల్లి అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న చేపట్టే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని రైతులను కోరారు. సమావేశంలో ఎంపీపీ తక్కళపల్లి స్వర్ణలత, పీఏసీఎస్ చైర్మన్ గుండెబోయిన నాగయ్య, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఏరుకొండ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు చల్లా దామెదర్‌రెడ్డి, మద్దెల బాబు, జీవన్, సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సదానందం, విద్యాసాగర్ పాల్గొన్నారు.
రైతులు ఆందోళనలకు సిద్ధం కావాలి
నర్సంపేట రూరల్: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో చేపట్టిన రైతుల పోరాటాల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగం ఆందోళనలకు సిద్ధం కావాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కమిటీ సభ్యుడు కొత్తకొండ రాజమౌళి, ఏఐకేఎఫ్ రైతు సంఘం జిల్లా నాయకుడు కేశెట్టి సదానందం పిలుపునిచ్చారు. ఈనెల 30న రైతు సంఘాల సమన్వయ కమిటీ చేపట్టిన చలో హైదరాబాద్ ప్రదర్శన, బహిరంగ సభకు రైతులు వేలాదిగా తరలిరవాలని ముద్రించిన కరపత్రాలను మాదన్నపేటలో ఎంసీపీఐ(యూ), ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు ఆవిష్కరించారు. రైతు ఉద్యమాన్ని అవహేళన చేస్తూ బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని వారు మండిపట్టారు. వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కేశెట్టి అనిల్, అనుమాల రమేశ్, సదానందం, కర్నె సాంబయ్య, గాదగోని బాబు, రాజేందర్, వక్కల రాజమౌళి, సూరయ్య, మొలుగూరి మొండయ్య, శ్రీనివాస్, గుర్రం రవి, దానం రాజయ్య పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తుది పోరు వాయిదా
- ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం సమాలోచన!
- హల్దీ వేడుకల్లో వరుణ్ ధావన్ హల్చల్
- నాటు వేసిన ఐఎఫ్ఎస్ అధికారి
- సాయిధరమ్ ‘రిపబ్లిక్’ మోషన్ పోస్టర్
- విజయవంతంగా ఆకాశ్-NG క్షిపణి పరీక్ష
- ఢిల్లీలో ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా
- పెళ్లి విందులో వైరల్ అయిన వంటకం
- టూరిజంలో మళ్లీ కొలువుల కళ!
- ఆడపిల్లల చదువు సమాజానికి వెలుగు : మంత్రి