శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Dec 28, 2020 , 00:07:37

కేంద్రంపై అన్నదాతల ఫైర్‌!

కేంద్రంపై అన్నదాతల ఫైర్‌!

  • నీటి ప్రాజెక్టులను అడ్డుకోవడంపై మండిపాటు
  • ఉధృతంగా ‘ఉత్తరయుద్ధం’
  • కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల వెల్లువ

 నర్సంపేట రూరల్‌, డిసెంబర్‌ 27: తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై అన్నదాతలు మండిపడుతున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఉత్తర యుద్ధాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు రైతులతో కలిసి ఉధృతం చేశారు. ఆదివారం నర్సంపేట డివిజన్‌ వ్యాప్తంగా ఉత్తరాలను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు పోస్టు  చేశారు. రామప్ప-రంగాయ, రామప్ప-పాకాల ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలను నిరసిస్తూ నర్సంపేట మండలంలోని రామవరం, చిన్న గురిజాల, ఆకులతండాలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతులు లేఖలను కేంద్రమంత్రికి పోస్టు చేశారు. ఈ సందర్భంగా రామవరం, చిన్న గురిజాల సర్పంచ్‌లు కొడారి రవన్న, గడ్డం సుజాత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం సరికాదన్నారు. కేంద్రం దిగొచ్చే వరకూ పోరాటం ఆగడని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గురిజాల ఎంపీటీసీ బండారు శ్రీలత-రమేశ్‌, రావమరం ఉప సర్పంచ్‌ జినుకల విమల, టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు అల్లి రవి, గ్రామ అధ్యక్షుడు పోతు శంకర్‌, జినుకల శంకర్‌, లక్ష్మీనారాయణ, కిరణ్‌, సంతోష్‌, అశోక్‌, నరేశ్‌, రంగారెడ్డి, మోహన్‌, సురేశ్‌, కోటి, గడ్డం రాజు, కృష్ణమూర్తి, ప్రభాకర్‌, పుప్పాల భీమయ్య, పుట్ట ప్రభాకర్‌, యాదగిరి, సంద సాంబయ్య, రవికుమార్‌, మినుముల భిక్షపతి, చిన్న రాజయ్య, బొళ్లం బక్కయ్య, రంజిత్‌, గోపి, సాంబయ్య, చంద్రమౌళి, రాజమల్లు, రవి పాల్గొన్నారు.

ప్రాజెక్టులను అడ్డుకోవడం దుర్మార్గం

ఖానాపురం: తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రం అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోత్‌ రామస్వామినాయక్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బుధరావుపేటలో ఉత్తరయుద్ధాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకాల-రంగాయ చెరువు ప్రాజెక్టులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. కేంద్రం రాజకీయ స్వార్థంతో అడ్డుకుంటున్నదని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, సర్పంచ్‌ కాస ప్రవీణ్‌కుమార్‌, ఎంపీటీసీ ఎస్‌కే సుభాన్‌బీ, మౌలానా, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు నాగరాజు, కృష్ణారెడ్డి, అల్లావుద్దీన్‌, రాజశేఖర్‌, సుధగాని మురళి, రాంనర్సింహారెడ్డి, లాదినేని ఎల్లయ్య, సతీశ్‌, వెంకన్న పాల్గొన్నారు.

వెంటనే ఉపసంహరించుకోవాలి

చెన్నారావుపేట: తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ బుర్రి తిరుపతి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కుండె మల్లయ్య కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. తిమ్మరాయిన్‌పహాడ్‌లో కేంద్రమంత్రికి కార్డులను పోస్టు చేశారు. కలెక్టరేట్‌ వద్ద ఈ నెల 29న జరిగే ఒక్కరోజు శాంతియుత ధర్నాను రైతులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అమీనాబాద్‌ సొసైటీ చైర్మన్‌ మురహరి రవి, మాజీ జడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, సర్పంచ్‌ కొండవీటి పావని, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్‌ కొండవీటి ప్రదీప్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రెడ్డిమాసి కిశోర్‌, పుట్టి భాస్కర్‌, ఉపసర్పంచ్‌ పూదోట శౌరీరాజు, మద్దినేని జాన్‌కిష్టఫర్‌, జోసప్‌తంబి, పూదోట అర్లయ్య, కస్పరాజు, నాగోత్‌ గోవయ్య, జయరాజు, అర్లయ్య, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు నరిశెట్టి రాజు, నరిశెట్టి ప్రదీప్‌, సతీశ్‌, పుట్టి రాకేశ్‌ పాల్గొన్నారు.

రైతుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం

దుగ్గొండి: దేశానికి అన్నం పెట్టే రైతన్నల కోసం ఎంతటి త్యాగానికైనా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు అన్నారు. మండలంలోని కేశవాపురం, భల్వంతాపురం, రేఖంపల్లిలో రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు కేంద్రమంత్రికి కార్డులను పోస్టు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, కంచరకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, ఆరె జైపాల్‌రెడ్డి, గోళి రవి, చల్లా సంజీవరెడ్డి, గొర్రె రఘు, కొనుకటి రాజేందర్‌, యార మోహన్‌రెడ్డి, యార సురేశ్‌, నర్సింహ, సర్పంచ్‌లు రేవూరి నారాయణరెడ్డి, శంకేసి శోభాకమలాకర్‌, వైనాల మురళి, ఎర్ర ఆదిరెడ్డి, రాజు, రాజేందర్‌ పాల్గొన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే..

నెక్కొండ: రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నదని విమర్శిస్తూ పెద్దకొర్పోలు రైతులు ఉత్తరయుద్ధంలో పాల్గొని నిరసన తెలిపారు. ఎంపీపీ రమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య ఆధ్వర్యంలో సర్పంచ్‌ మహబూబ్‌ పాషా, ఎంపీటీసీ సుకన్యతోపాటు రైతులు ఉత్తరాలను పోస్టుబాక్సులో వేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ప్రాజెక్టులకు క్లియరెన్స్‌ ఇవ్వకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు కుమారస్వామి, అనిత, శ్రీను, నాయకులు కట్కూరి నరేందర్‌రెడ్డి, కర్ర బుచ్చిరెడ్డి, చెన్నారెడ్డి, నిత్యానందం, దామోదర్‌, యూత్‌ అధ్యక్షుడు రాజు యాదవ్‌ పాల్గొన్నారు.