ప్రాజెక్టులు నిలిపివేస్తే వత్తాసు పలకడం హేయం

- మాజీ ఎమ్మెల్యే రేవూరివి మతిలేని మాటలు
- నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట : రాష్ట్రంలోని ఏడు ప్రా జెక్టులను నిలిపివేయాలని కేంద్ర ప్రభు త్వం ఆదేశాలు ఇస్తే, స్థానిక రైతుల పక్షం వహించకుండా మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కేంద్రం తరుఫున వత్తాసు పలకడం సరికాదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం నర్సంపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది మాట్లాడారు. ప్రజల కోసం పోరాడని వారు ఎప్పటికీ నాయకులు కాలేరన్నా రు. ఈ ప్రాంతంలోని రైతులు 15 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా గెలిపించినా ఆయన వారి పక్షం నిలవడం లేదన్నారు. కాళేశ్వరం ఫేజ్-3 పనులు ఆపాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వడం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాకు నష్టం జరుగుతుందన్నారు. దీనివల్ల ఎస్సారెస్పీ డీబీఎం 40,38, 48 కాల్వలకు నీరు అందక ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. పాకాల, రంగాయ ప్రాజెక్టును కూడా ఆపాలని కేంద్రం ఆదేశించిందన్నారు. ఎస్సారెస్పీ కాల్వల వల్ల 55 వేల ఎకరాలు, పాకాల ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలు, రంగాయ ప్రా జెక్టు కింద 32,500 ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. రంగాయ, పాకాల ప్రాజెక్టు పరిధిలను విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అయినా, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మతిలేని మాటలు మాట్లాడుతూ రైతులను పక్కతోవపట్టించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పాలిట శాపంగా మా రిన నూతన వ్యవసాయ చట్టాలు, ప్రస్తుత కేంద్రం వైఖరిపై నోరు మెదపని మాజీ ఎమ్మెల్యే ఈ ప్రాంత ప్రజల భవిష్యత్‌కు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులపై ఎలాం టి సానుభూతి లేకుండా నిలకడ లేని ప్రకటనలు చేస్తున్న నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. నూ తన ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఎకరానికీ నీరందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రాజెక్టులను నిలిపివేడంతో రెండు లక్షల మందితో పోస్టు కార్డుల ద్వారా నిరసన యుద్ధం చేస్తున్నామన్నారు. ఈ నెల చివరి వరకు ఇది కొనసాగుతుందన్నారు. అలాగే, ఈ నెల 29న కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ధర్నా చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, వైస్‌చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, గుంటి కిషన్, యువరాజు, రాణాప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- ముందే శ్వేతసౌధాన్ని వీడనున్న ట్రంప్!
- కమలా హర్రీస్ రాజీనామా.. దేనికంటే!
- టెస్లా మస్క్ స్టైలే విభిన్నం: పన్ను రాయితీకే మొగ్గు
- ఆ సీక్రెట్ అతనొక్కడికే తెలుసంటున్న నిహారిక..!
- చిరంజీవి మెగా ప్లాన్.. ఒకేసారి 2 సినిమాలకు డేట్స్..!
- బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
- ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్
- డేటా ఇన్ఫ్రా, కృత్రిమ మేధపైనే ఫోకస్
- ఆదిపురుష్ లాంఛింగ్‌కు టైం ఫిక్స్..!
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?