బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Dec 27, 2020 , 02:02:18

క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం

క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం

దామెర: క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారుల సంక్షేమానికి ప్రభుత్వం అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర వాలిబాల్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులుగా నియమితులైన నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు అన్నారు. నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు రాష్ట్ర వాలిబాల్‌ ఆసోసియేషన్‌ ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా శనివారం దామెర మండల టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు నిమ్మగడ్డకు హన్మకొండలో పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో తమ ప్రతిభాపాటవాలను చాటాలని  రాష్ర్టానికి మంచి పేరుప్రఖ్యాతులు  తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాగితాల శంకర్‌, వైస్‌ ఎంపీపీ జాకీర్‌ అలీ, సర్పంచ్‌శ్రీనివాస్‌, ఎంపీటీసీ రాము, ఏఎంసీ డైరెక్టర్‌లు ఆరె వెంకట్‌రెడ్డి, దాడి మల్లయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు కమలాకర్‌, పున్నం సంపత్‌, గరిగె కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ జన్ను మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


logo