గురువారం 28 జనవరి 2021
Warangal-rural - Dec 27, 2020 , 02:02:20

రైతు ధర్నాను విజయవంతం చేయాలి

రైతు ధర్నాను విజయవంతం చేయాలి

  • వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

ఐనవోలు : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 29న వరంగల్‌ రూరల్‌  కలెక్టర్‌ కార్యాలయం ఎదుట చేపట్టే  రైతు ధర్నాను విజయవంతం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ పిలుపు నిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పర్వతగిరి, వర్ధన్నపేట, ఐనవోలు మండలాలకు చెందిన  ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్కో మండలం నుంచి సుమారు 500 మంది రైతులు ధర్నాలో పాల్గొనాలని సూచించారు. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులతో రైతులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గజ్జెల్లి శ్రీరాములు, వర్ధన్నపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆంగోత్‌ అరుణ, ఎంపీపీలు మార్నేని మధుమతి, అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీలు మార్గం భిక్షపతి, బానోత్‌ సింగ్‌లాల్‌, వైస్‌ ఎంపీపీ తంపుల మోహన్‌,  పార్టీ మండల అధ్యక్షులు పొలెపల్లి శంకర్‌రెడ్డి, రంగు కుమార్‌, ప్రధాన కార్యదర్శి మిద్దెపాక రవీందర్‌ పాల్గొన్నారు.  


logo