శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - Dec 25, 2020 , 02:28:27

కేసీఆర్‌ పాలనలో అన్ని మతాలు సమానమే

కేసీఆర్‌ పాలనలో అన్ని మతాలు సమానమే

  • వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ 

కాజీపేట :  సీఎం కేసీఆర్‌ అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తున్నారని వర్ధన్నపేట  ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. గ్రేటర్‌ 53వ డివిజన్‌ పరిధిలోని టేకులగూడెంలో ఆయన గురువారం క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొని కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం క్రైస్తవులకు ప్రభుత్వం అందజేస్తున్న బహుమతులు, దుస్తులను పంపిణీ చేశారు. అంతకుముందు గ్రామంలో తన నిధులు రూ.10లక్షలతో రెండు చర్చిల్లో నిర్మించిన అధునాతన ముత్రశాలలు, మరుగుదొడ్లను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పండుగనూ అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పవిత్ర బైబిల్‌ ప్రతి సమస్యకూ పరిష్కారాన్ని సూచిస్తుందన్నారు. కార్యక్రమంలో పాస్టర్లు జాకబ్‌, దాసు, కొరియన్‌, కరుణాకర్‌, అశోక్‌, దేవదాసుతోపాటు  టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు రామ్మూర్తి పోలపల్లి, గ్రామ అధ్యక్షుడు పసునూరి రమేశ్‌, రైతుబంధు సమితి కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మడికొండ గ్రామ అధ్యక్షుడు దువ్వ నవీన్‌, దర్గా సొసైటీ అధ్యక్షుడు వనంరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు శేఖర్‌, రమేశ్‌, బస్కె కృష్ణ, నాగరాజు, పేపర్‌ రవి, పోలు రాజేశ్‌, శివ, రొయ్యల లక్ష్మణ్‌, సతీశ్‌, రవీందర్‌, బైరి కొమురయ్య, ఆర్‌ఐ పాండవుల సురేందర్‌ పాల్గొన్నారు.  logo