Warangal-rural
- Dec 23, 2020 , 00:06:54
నలుగురు వాహన దొంగల అరెస్టు

- ఏడు బైక్‌లు, నాలుగు ఆటోలు స్వాధీనం
పరకాల: నిర్మానుష్య ప్ర దేశాలు, ఇంటి ఎదుట పార్కింగ్ చేసిన వాహనాలను అపహరించిన నలుగురు దొంగలను అరెస్టు చేసి, వారి నుంచి ఏడు ద్వి చక్ర వాహనాలు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మి తెలిపారు. మంగళవారం పరకాల పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్‌తో కలిసి నిందితుల వివరాలు వెల్లడించారు. డీసీపీ కథనం ప్రకారం.. పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా పలు ప్రాంతాల్లో బైక్‌లు, ఆటోలను అపహరించినట్లు ఒప్పుకున్నారు. పెద్దంపేటకు చెందిన దుర్గం సురేశ్, పరకాలకు చెందిన సీపతి కల్యాణ్, కౌకొండకు చెందిన గట్టు శ్రీకాంత్, శానగొండకు చెందిన గుంటి శ్రావణ్గా వారిని గుర్తించారు. వీరితో పాటు మరో ఇద్దరు సర్వాయిపేటకు చెందిన కుమ్మరి కుమార్, మహారాష్ట్రకు చెందిన బెడికి బాబు పరారీలో ఉన్నారు. వీరు పక్కాప్లాన్ ప్రకారం వరంగల్, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాహనాలను దొంగిలించారు. వీరు సంవత్సర కాలంలో మొత్తం 24వాహనాలను అపహరించగా, 11 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. మిగతా 14వాహనాలను మహారాష్ట్రకు చెందిన నిందితుడు బాబు మిగతా వారికి డబ్బులు చెల్లించి తన ఆధీనంలో ఉంచుకున్నారు. దుర్గం సురేశ్ 13కేసుల్లో, కల్యాణ్ 6కేసుల్లో నిందితులుగా ఉండి శిక్షను అనుభవించారు. మరో నిందితుడు గుంటి శ్రావణ్ 8 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడిపై రెండు సార్లు పీడీ యాక్టు నమోదుకాగా, ఐదు సంవత్సరాల శిక్షను అనుభవించాడు. కాగా, నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. కాగా కేసు పరిశోధనలో చురుగ్గా వ్యవహరించిన సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సైలు శ్రీకాంత్, వెంకటకృష్ణ, శాయంపేట ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ను డీసీపీ వెంకటలక్ష్మి, ఏసీపీ శ్రీనివాస్ అభినందించారు.
తాజావార్తలు
- ‘కొవిడ్ వ్యాక్సినేషన్‌ను పక్కాగా చేపట్టాలి’
- బీటీపీఎస్ 3వ యూనిట్ సింక్రనైజేషన్ సక్సెస్
- పండుగవేళ కేటీఆర్‌పై అభిమానం..
- టీఆర్పీ స్కాం: రిపబ్లిక్ టీవీ సీఈవో గోస్వామి జైలుకెళ్లాల్సిందే
- బాలుడికి లింగ మార్పిడి చేసి.. మూడేండ్లుగా లైంగికదాడి
- తక్కువ వడ్డీరేట్లు.. ఇంటి రుణానికి ఇదే సరైన టైం!
- అనుమానం వద్దు.. తొలి టీకా నేనే వేయించుకుంటా : మంత్రి ఈటల
- వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు
- భారీ మొసలిని కాపాడిన వన్యప్రాణుల సంరక్షకులు
- మిలిటరీతో లింక్స్:జియోమీపై ట్రంప్ నిషేధం!
MOST READ
TRENDING