దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి చర్యలు

- ఎన్పీఆర్డీ ఇండియా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగరావు
పరకాల : రాష్ట్రంలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, అందులో భాగంగానే దివ్యాంగులపై వేధింపులను అరికట్టేందుకు, వారి హక్కులను పరిరక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు సర్కార్ సిద్ధమైందని ఎన్పీఆర్డీ ఇండియా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సర్సింగరావు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఎన్పీఆర్డీ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డును నర్సింగరావు అందుకున్నారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ దివ్యాంగుల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి దివ్యాంగులపై ఉన్న ప్రత్యేక దృష్టికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు తుడుం రాజేందర్, మున్నా, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సీడీకె గ్లోబల్ వర్ట్యువల్ కన్వర్జెన్స్ -2021
- కరోనా క్రైసిస్ ఉన్నా.. స్టార్టప్‌లు భేష్!!
- బంద్ కానున్న గూగుల్ డ్యుయో సేవలు..?
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్‌ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిక