ఆదివారం 17 జనవరి 2021
Warangal-rural - Dec 23, 2020 , 00:07:03

అయ్యప్ప ఆలయంలో పూజలు

 అయ్యప్ప ఆలయంలో పూజలు

నర్సంపేట, డిసెంబర్‌ 22 : నర్సంపేటలోని అయ్యప్ప దేవాలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ శింగిరికొండ మాధవశంకర్‌ రజినీ గుప్తా ఆధ్వర్యంలో 37వ రోజు స్వాములు భజనలు చేశారు. వేద పండితులు దేవేశ్‌ మిశ్రా, సతీశ్‌ తివారీ, నిరాకారు సాహు, బొమ్మెర పరమాత్మ 18 మెట్ల పడిపూజ నిర్వహించారు.  అనంతరం బొద్దుల త్రివేణి దివాకర్‌, నాగరాజు, సౌమ్యశ్రీ అయ్యప్ప స్వామికి నైవేద్యం సమర్పించి, అన్నదానం చేశారు. కార్యక్రమంలో వంగేటి గోవర్ధన్‌, మాదారపు చంద్రశేఖర్‌, శ్రీరాముల శంకరయ్య, భూపతి లక్ష్మీనారాయణ, శ్రీరాం ఈశ్వరయ్య, చింతల కమలాకర్‌, కందిగొండ తిరుపతి, పుల్లూరి స్వామి గౌడ్‌, పాలడుగుల రాంబాబు, అడ్డగట్ల రాజేందర్‌, దేశీ రాము తదితరులు పాల్గొన్నారు.