గురువారం 21 జనవరి 2021
Warangal-rural - Dec 22, 2020 , 00:52:14

రైతుల చావుకు కేంద్రమే కారణం

రైతుల చావుకు కేంద్రమే కారణం

  • పలు గ్రామాల్లో కొవ్వొత్తులతో రైతులు,నాయకుల ర్యాలీమృతులకు నివాళులర్పించిన ప్రజలు

నర్సంపేట, డిసెంబర్‌ 21 : రైతుల చావుకు కేంద్ర ప్రభుత్వమే కారణమని ఏఐకేఎస్‌సీసీ జిల్లా కన్వీనర్‌ పెద్దారపురమేశ్‌, న్యూడెమోక్రసీ డివిజన్‌ కార్యదర్శి లావుడ్యా రమే శ్‌, జిల్లా నాయకులు ఎలకంటి రాజేందర్‌, టీపీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జనగాం కుమారస్వామి అన్నారు. మోదీ చట్టాలను వ్యతిరేకించాలని సోమవారం అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రైతు సంఘాల కార్యకర్తలు అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి కాగడాలు, కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 26రోజులుగా  రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చేపట్టిన నిరసనలో పాల్గొన్న కొందరు రైతుల మృతికి కేంద్రమే కారణం అన్నారు. ప్రజా సంక్షే మం పేరుతో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో మొగిలి ప్రతాపరెడ్డి, కన్నం వెంకన్న, రాగసుధ, గొర్రె శోభ, కొత్తకొండ రాజమౌళి, అశోక్‌, అఖిల్‌, రాజు, రత్నం పాల్గొన్నారు.

కేంద్రమే బాధ్యత వహించాలి...

చెన్నారావుపేట : ఢిల్లీలో 30 మంది రైతుల చావుకు కేం ద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎంసీపీఐ (యూ) మండల నాయకులు జన్న రమేశ్‌ అన్నారు. ఆదివారం రాత్రి చెన్నారావుపేటలో ఎంసీపీఐ(యూ) , ఏఐకేఎఫ్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. రైతులపై లాఠీచార్జీ, బాష్పవాయువు, వాటర్‌తో దాడులు చేయించడం తగదన్నారు. మోదీ సర్కార్‌పై ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు మండల సురేశ్‌, పులి భిక్షపతి, మల్లయ్య, ఐలమ్మ, రాజు, ఉమ, కోమల, సాంబయ్య, కళ, అమృతమ్మ, కొమురమ్మ తదితరులు పాల్గొన్నారు.

చట్టాలను ఉపసంహరించుకోవాలి

ఖానాపురం: రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతు కూలీ సంఘం నర్సంపేట డివిజన్‌ కార్యదర్శి ఈరెల్లి రాంచందర్‌ అన్నారు. ఈ మేరకు  బుధరావుపేటలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో  అమరులైన 30 మంది రైతులకు నివాళులర్పించారు. కార్పొరేట్‌ సంస్థలకు వత్తాసు పలుకుతున్న బీజేపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సోమన్న, దేవస్వామి, అశోక్‌, రాధాకృష్ణ, శారద, ఈశ్వరి, లక్ష్మీస్వరూప తదితరులు పాల్గొన్నారు.logo