సోమవారం 25 జనవరి 2021
Warangal-rural - Dec 22, 2020 , 00:16:04

లక్నేపల్లిలో పుట్టి.. ప్రధానిగా ఎదిగి

లక్నేపల్లిలో పుట్టి.. ప్రధానిగా ఎదిగి

  • రాజకీయాల్లో పీవీది చెరుగని ముద్ర
  • ఆయనకు అరుదైన గౌరవం కల్పిస్తున్న తెలంగాణ సర్కార్‌
  • రేపు పీవీ వర్ధంతి
  • సంవత్సరం పొడవునా  శత జయంతి వేడుకులు

పీవీ నర్సింహారావు నర్సంపేట మండలం లక్నేపల్లిలో పుట్టి అంచెలంచెలుగా ప్రధానిగా ఎదిగారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషాకోవిదుడు, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మేధావి. గత కాంగ్రెస్‌ పాలకులు ఆయనను విస్మరించినా తెలంగాణ సర్కార్‌ పీవీకి అరుదైన గౌరవం కల్పిస్తున్నది. ఆయన శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహిస్తున్నది. ఈ నెల 23న పీవీ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాల దొంతరపై కథనం..

 - నర్సంపేట రూరల్‌

1951లో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడిగా, 1952లో కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1957-72 మధ్యకాలంలో నాలుగుసార్లు మంథని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1967లో కాసు బ్రహ్మానందరెడ్డి మం త్రివర్గంలో వైద్య, ఆరోగ్య, విద్య, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1971 సెప్టెంబర్‌లో ఏపీ రాష్ట్ర ముఖ్యమం త్రి బాధ్యతలు చేపట్టారు. అప్పుడు భూసంస్కరణలు అమలు చేసి పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 1973-75 మధ్య కాలంలో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 1977లో హన్మకొండ లోక్‌సభకు ఎన్నికై ఇందిరాగాంధీ మంత్రివర్గం లో హోం, విదేశాంగ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ మంత్రి వర్గంలో హోంశాఖ, మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 1991లో దేశ అత్యున్నత ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు.

లక్నేపల్లి గ్రామంలోని అమ్మమ్మ ఇంట్లో రుక్మిణీదేవి-సీతారామారావు దంపతులకు 1921జూన్‌ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. ప్రాథమిక విద్యను తండ్రి ఊరైన వంగర, వరంగల్‌లో పూర్తి చేశారు. 1926లో మెట్రిక్‌ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. మహారాష్ట్రలోని పుణెలో బీఎస్సీ, నాగపూర్‌ విశ్వవి ద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 

  • రాజకీయాల్లో పీవీది చెరుగని ముద్ర
  • ఆయనకు అరుదైన గౌరవం కల్పిస్తున్న తెలంగాణ సర్కార్‌రేపు పీవీ వర్ధంతి
  • సంవత్సరం పొడవునా శత జయంతి వేడుకలు

2004 డిసెంబర్‌ 23న పీవీ మరణించగా, ఆయన అంత్యక్రియల్లో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ పీవీ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్‌ 28 నుంచి ఏడాది పొడవునా శత జ యంతి ఉత్సవాలను జరుపుతున్నారు.

 పీవీ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు 

పీవీ జ్ఞాపకార్థం లక్నేపల్లిలో పీవీ మెమోరియల్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. అందులో గ్రంథాలయం, వసతులు కల్పించారు. అక్కడే పీవీ కాంస్య విగ్రహాన్ని కుటుంబసభ్యుల సహకారంతో నెలకొల్పారు. ఆయన జయంతి, వర్ధంతి సందర్భంగా పీవీ కూతురు సురభివాణీదేవి అన్నదానం, పండ్లు, పుస్తకాల పంపిణీ, తదితర కార్యక్రమాలు చేస్తున్నారు.


logo