మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Dec 21, 2020 , 00:44:12

అయ్యప్ప ఆలయంలో ఘనంగా పూజలు

అయ్యప్ప ఆలయంలో ఘనంగా  పూజలు

నర్సంపేట:అయ్యప్ప ఆలయంలో ద్విదశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా ఆదివారం భక్తు లు పూజలు చేశారు. మండ ల పూజోత్సవాలు ఆలయ కమిటీ చైర్మన్‌ శింగిరికొండ మాధవశంకర్జ్రనీగుప్త ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. 35వ రోజు మహా అన్నదాన కార్యక్రమంలో భాగంగా అయ్యప్పస్వామికి నైవేధ్యాలు సమర్పించారు. అనంతరం స్వాములకు భిక్ష వడ్డించారు. అన్నదాతలుగా తమన్న ఎంటర్‌ ప్రైజెస్‌ వరంగల్‌ గట్టు రమేశ్‌బాబు, ధనలక్ష్మి, కొత్తకొండ శ్యాంరాజ్‌, మేఘన, నగజా స్పైసెస్‌ షిండే సురేశ్‌, మనీషా, కిర్నటి వెంకటేశ్వర్లు, భానుమతి వ్యవహరించారు. వేద పండితులు దేవేశ్‌మిశ్రా, సతీశ్‌ తివారి మంత్రోచ్ఛారణల నడుమ పూజలు చేశారు. కార్యక్రమంలో వంగేటి గోవర్ధన్‌, మాదారపు చంద్రశేఖర్‌, శ్రీరాం ఈశ్వర య్య, శ్రీరాముల శంకరయ్య, గందె సంజీవరావు, పుల్లూరి స్వామిగౌడ్‌ పాల్గొన్నారు.