శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Dec 20, 2020 , 02:33:38

ప్రజలు భాగస్వాములు కావాలి

ప్రజలు భాగస్వాములు కావాలి

పరకాల: పారిశుధ్య పనుల నిర్వహణలో ప్రజలు భాగస్వాములు కావాలని పరకాలలోని 2వ వార్డు కౌన్సిలర్‌ ఒంటేరు సారయ్య కోరారు. శనివారం వార్డు పరిధిలో పారిశుధ్య పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. వార్డులు పరిశుభ్రంగా ఉండేందుకు కార్మికుల సంఖ్యను పెంచడంతో పాటు చెత్త సేకరణకు వాహనాలను అందించినట్లు తెలిపారు. వార్డు ప్రజలు తమ ఇంట్లోనే తడి, పొడి చెత్తను విభజించి వాహనాలకు అందించాలని కోరారు. వార్డు పరిధిలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.