సహజ ప్రసవాలతో తల్లీబిడ్డలు సురక్షితం

- గర్భిణుల వెంట ఆశ వర్కర్లు దవాఖానకు వెళ్లాలి
- మాతాశిశు సేవలు భగవంతుడిస్మరణతో సమానం
- రాష్ట్ర మాతాశిశు ఆరోగ్య నోడల్ఆఫీసర్ డాక్టర్ అశోక్‌కుమార్
రాయపర్తి, డిసెంబర్ 19 : సహజ ప్రసవాలతో పిల్లలు తెలివైన వారిగా మారడంతోపాటు తల్లీబిడ్డల ఆరోగ్యాలు సురక్షితంగా ఉంటాయని రాష్ట్ర మతాశిశు ఆరోగ్య నోడల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం డీఎంహెచ్‌వో డాక్టర్ మధుసూదన్, జిల్లా మాతాశిశు సంక్షేమ అధికారి డాక్టర్ పద్మశ్రీతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి భూక్యా వెంకటేశ్ నేతృత్వంలో మండలంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. శస్త్ర చికిత్సలతో కాకుండా సహజ ప్రసవాల్లో జన్మించిన బిడ్డలు ఎంతో తెలివైన వారుగా మారుతున్నట్లు పలు సర్వేల్లో తేలినట్లు అశోక్‌కుమార్ చెప్పారు. అంతేకాకుండా కాన్పుల కోసం మహిళలకు ఆపరేషన్లు చేయడం వల్ల భవిష్యత్‌లో సదరు మహిళలు అనారోగ్యాల బారిన పడుతున్నట్లు వివరించారు. మండలంలోని 39 గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. మాతాశిశువులకు సేవ చేసే అవకాశం లభించడం వైద్య సిబ్బందికి భగవంతుడు కల్పించిన గొప్ప వరమని తెలిపారు. మాతాశిశువులకు సేవలు అందించడమంటే భగవంతుడిని స్మరించినట్లు భావించాలని కోరారు.
గర్భిణుల సమాచారం సిద్ధంగా ఉండాలి
మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతి రోజూ నమోదవుతున్న గర్భిణుల సమాచారాలు ఆశ వర్కర్ల వద్ద ఎప్పటికప్పుడు సి ద్ధంగా ఉండాలని, గర్భిణులు నెలనెలా ప రీక్షల కోసం దవాఖానకు వచ్చేటప్పుడు త ప్పనిసరిగా వారి వెంట ఆశ వర్కర్ రావాలని ఆదేశించారు. విధులపై నిర్లక్ష్యం, అశ్ర ద్ధ వహించే ఆశ వర్కర్లు, వైద్య ఆరోగ్య సి బ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు, చికిత్సల సంఖ్యను మెరుగుపర్చాలని వైద్యులకు సూచించారు. అ నంతరం మాతాశిశు సంరక్షణ, ఆరోగ్యాల పై తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై అ వగాహన కల్పించారు. కార్యక్రమంలో హె చ్ఈవో వెంకటేశ్వర్రావు, ఆయుష్ వైద్యాధికారి కొండూరి రవికుమార్, మాధవి, సునీత, జయలత, రజియా, సరస్వతి, నా గమణి, రాజేశ్వరి, పద్మ పాల్గొన్నారు.
తాజావార్తలు
- త్వరలో మరో ‘జన్ రసోయి’ని ప్రారంభిస్తాం: గౌతమ్ గంభీర్
- రైతు సంక్షేమానికి సర్కారు కృషి : మండలి చైర్మన్ గుత్తా
- నానబెట్టిన నల్ల శనగలు తినొచ్చా.. తింటే ఏంటి లాభం.?
- సీఎంఆర్ సంస్థను రద్దు చేయాలి
- ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో కేసీఆర్‌కు ఐదో స్థానం
- స్టంట్ చేస్తుండగా సంపూర్ణేశ్‌కు ప్రమాదం..!
- ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు
- మెరుగ్గానే శశికళ ఆరోగ్యం
- రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా సంగక్కర
- శరీరంలో ఈ 7 అవయవాలు లేకున్నా బతికేయొచ్చు!!