శుక్రవారం 15 జనవరి 2021
Warangal-rural - Dec 20, 2020 , 01:17:51

కిలకిలల కల్లెడ

కిలకిలల కల్లెడ

  • రకరకాల పక్షులకు ఆవాసం
  • విరివిగా అనువైన చెట్ల పెంపకం
  • కృత్రిమ పిట్టగూళ్లతో సంరక్షణ
  • పెరుగుతున్న ఊర పిచ్చుకలు.. కొత్త జాతులు 
  • గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం
  • పెంపొందుతున్న జీవవైవిధ్యం  
  • కృత్రిమ పిట్టగూళ్లు

కల్లెడలో పక్షుల ఆవాసమైన చెట్లతో పాటు పక్షుల కోసం కృత్రిమంగా తయారు చేసిన పిట్టగూళ్లు కూడా కనిపిస్తాయి. మొదట రామ్మోహన్‌రావు తన ఇంటి ఆవరణలో వెదురు కర్రలతో కృత్రిమ పిట్టగూళ్లను తయారు చేసి పెట్టారు. ఇంటి కప్పు వద్ద, చెట్ల కొమ్మలపైన వీటిని ఏర్పాటు చేశారు. గ్రామంలో పలు చోట్ల, చెట్లపైనా ఇలాంటి పిట్టగూళ్లనే పెట్టించారు. ఆవాసం ఏర్పడడంతో కల్లెడ ఇప్పుడు ఊర పిచ్చుకలకే కాదు అనేక జాతులకు నెలవైంది. ఊర పిచ్చుకలు, పూరేడు పిట్టలు, చిలుకలు, గొర్రెంకలు, పావురాలు, గువ్వలు, లకుముకి పిట్టలు, వడ్రంగి పిట్టలు, ఈము పక్షులు ఇలా పలు జాతులు రామ్మోహన్‌రావు ఇంటి ఆవరణలోనే గాకుండా కల్లెడలో ఆవాసం పొందుతున్నాయి. చెట్ల పెంపకం, పక్షుల సంరక్షణలో కల్లెడ గ్రామస్తులు సైతం ముందుంటున్నారు. పక్షుల కూతల నడుమ ఆనందమయ జీవనం సాగిస్తున్నారు. ఈ పక్షులను చూసేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు కల్లెడకు వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. పక్షులను ఎవరూ వేటాడి చంపకుండా స్థానికుల్లో అవగాహన కల్పిస్తున్నారు. వేటగాళ్లను పిలిచి కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చారు. ఎన్నో వనరులు ఇస్తున్న ప్రకృతిని కాపాడుకోవడంలో ఈ గ్రామస్తులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

పర్యావరణ పరిరక్షణలో వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఊర పిచ్చుకల నుంచి మొదలుకుని అనేక జాతుల పిట్టలు ఇక్కడ సందడి చేస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామానికి చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు పర్యావరణ సంరక్షణకు తనవంతు చేసిన కృషికి ఫలితంగా ఇప్పుడు ఆ ఊరి వాతావరణమే మారిపోయింది. ఆయన తొలుత హైదరాబాద్‌ నుంచి కొన్ని ఊర పిచ్చుకలను తెచ్చి కల్లెడలోని తన ఇంటి ఆవరణలో పెంచారు. పక్షులకు ఆవాసమైన మేడి, పొగడ, మర్రి, నేరేడు, కదంబ, వేప, మల్బరీ, రామ సీతాఫలం, ఇప్ప, రావి, పనస, రాంఫత్‌, వాటర్‌ ఆపిల్‌, సిమ్లా ఆపిల్‌, సీమచింత, పనస, సింగపూర్‌ చెర్రీ, సన్‌ ఫ్లవర్‌ తదితర మొక్కలను విరివిగా పెంచారు. పూలు, పండ్ల చెట్లకు డ్రిప్‌ ద్వారా నీరందిస్తున్నారు. తన ఇంటి ఆవరణలోనే కాకుండా కల్లెడ గ్రామంలో పక్షుల ఆవాసమైన చెట్లు పెరిగేలా దోహదపడ్డారు. ప్రస్తుతం మర్రి, మేడి, నేరేడు, పొగడ తదితర చెట్లతో గ్రామం గ్రీనరీని తలపిస్తున్నది. 

పంటల సాగులో రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరిగిపోవడం, చెట్ల నరికివేత ఇష్టారీతిన సాగడంతో ఆ ప్రభావం పక్షులపై పడింది. ఈ క్రమంలో చాలా జాతులు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. దీని వల్ల జీవ వైవిధ్యం కూడా దెబ్బతినే ప్రమాదముంది. దీన్ని గుర్తించిన ఓ ప్రకృతి ప్రేమికుడు పిట్టల సంరక్షణకు ముందుకొచ్చాడు. విరివిగా చెట్లు పెంచుతూ, కృత్రిమ గూళ్లు ఏర్పాటు చేస్తూ పక్షులను సంరక్షిస్తుండడంతో ఇప్పుడా ఊరు కిలకిలారావాలతో సందడిగా మారింది. 

పర్యావరణ పరిరక్షణలో వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఊర పిచ్చుకల నుంచి మొదలుకుని అనేక జాతుల పిట్టలు ఇక్కడ సందడి చేస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామానికి చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు పర్యావరణ సంరక్షణకు తనవంతు చేసిన కృషికి ఫలితంగా ఇప్పుడు ఆ ఊరి వాతావరణమే మారిపోయింది. ఆయన తొలుత హైదరాబాద్‌ నుంచి కొన్ని ఊర పిచ్చుకలను తెచ్చి కల్లెడలోని తన ఇంటి ఆవరణలో పెంచారు. పక్షులకు ఆవాసమైన మేడి, పొగడ, మర్రి, నేరేడు, కదంబ, వేప, మల్బరీ, రామ సీతాఫలం, ఇప్ప, రావి, పనస, రాంఫత్‌, వాటర్‌ ఆపిల్‌, సిమ్లా ఆపిల్‌, సీమచింత, పనస, సింగపూర్‌ చెర్రీ, సన్‌ ఫ్లవర్‌ తదితర మొక్కలను విరివిగా పెంచారు. పూలు, పండ్ల చెట్లకు డ్రిప్‌ ద్వారా నీరందిస్తున్నారు. తన ఇంటి ఆవరణలోనే కాకుండా కల్లెడ గ్రామంలో పక్షుల ఆవాసమైన చెట్లు పెరిగేలా దోహదపడ్డారు. ప్రస్తుతం మర్రి, మేడి, నేరేడు, పొగడ తదితర చెట్లతో గ్రామం గ్రీనరీని తలపిస్తున్నది. 

కృత్రిమ పిట్టగూళ్లు