ప్రజలను చైతన్యం చేయాలి

- చిచ్చు పెట్టే శక్తులను ఎదిరించాలి
- సకల మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్న కేసీఆర్
- అధికారికంగా పండుగల నిర్వహణ
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
రాయపర్తి, డిసెంబర్ 18: రాష్ట్రంలో కాలానుగుణంగా వస్తున్న మార్పులు, రోజూ జరిగే ఘటనలు, పరిస్థితులపై ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులతోపాటు టీఆర్ఎస్ శ్రేణులపై ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలకేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి హాజరై రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రాజకీయ పార్టీల సమీకరణాలు, బలాబలాలపై చర్చించారు. జాతీయ పార్టీగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ రాష్ట్ర ప్రజల మధ్య కులమతాల పేరుతో చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నదని విమర్శించారు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య వైషమ్యాలు, తగాదాలకు ఆజ్యం పోసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విషపూరిత రాజకీయాలపై ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేయాలని సూచించారు.
కేసీఆర్‌తో పండుగలకు కొత్తశోభ
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పండుగలకు కొత్త శోభ తెచ్చారని ఎర్రబెల్లి కొనియాడారు. మండలకేంద్రంలోని మన్నా చర్చిలో పాస్టర్ నెల్సన్ అధ్యక్షతన జరిగిన ముందస్తు క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రార్థనలు చేశారు. సీఎం కేసీఆర్ హిందూ, ముస్లిం, క్రైస్తవులకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి తెలిపారు. అన్ని మతాల పర్వదినాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అనంతరం క్రిస్టియన్లకు కానుకలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మత బోధకులు ఆనంద్, రత్నపాల్, జాన్సన్, దేవానందం, యాకుబ్, మోహన్, జోసఫ్, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్, వర్ధన్నపేట డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ గోపాల్‌రావు, మండల వైద్యాధికారి భూక్యా వెంకటేశ్, వైద్యారోగ్య సిబ్బంది మాధవి, సునీత పాల్గొన్నారు.
ఆపదలో ఆత్మీయనేస్తం.. 108
ఆపదలో ఉన్న వారికి ఆత్మీయనేస్తం 108 వాహనాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో మండలానికి వచ్చిన 108 అంబులెన్స్‌ను ఎర్రబెల్లి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులతో పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, జిల్లా నాయకుడు బిల్లా సుధీర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు గారె నర్సయ్య, అయిత రాంచందర్, బిల్లా రాధిక, సుభాష్‌రెడ్డి, రెంటాల గోవర్ధన్‌రెడ్డి, కోదాటి దయాకర్‌రావు, పూస మధు, కాంచనపల్లి వనజారాణి, గాజులపాటి నర్మద, ఎండీ నయీం, మచ్చ సత్యం, కుందూరు రాంచంద్రారెడ్డి, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్‌యాదవ్, లేతాకుల యాదవరెడ్డి, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, మందాడి సుదర్శన్‌రెడ్డి, సుభాష్, మాలోత్ వసుందర్, పాలెపు శ్రీనివాస్‌రావు, కేసాని వెంకట్‌రెడ్డి, కుక్కుడపు జయశ్రీ, ఉల్లెంగుల నర్సయ్య, సతీశ్, మండల శ్రీధర్, బోనగిరి ఎల్లయ్య, భద్రునాయక్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ముఖ్యమంత్రికి కృతజ్ఞతలతో..
- ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
- ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
- కేటీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతారు
- సైదన్న జాతర సమాప్తం
- అవకాశమిస్తే.. కాదా! ఆకాశమే హద్దు
- సమన్వయంతో పని చేయాలి
- పాఠశాల పరిసరాలను శుభ్రం చేయాలి
- సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
- తల్లీబిడ్డల సంక్షేమం కోసమే మాతా శిశు దవాఖాన