విద్యతోనే వృద్ధిలోకి..

- గిరిజనుల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
- దేశంలోనే తొలి గిరిజన సైనిక్ స్కూల్ అశోక్‌నగర్‌లో ఏర్పాటు
- త్వరలో గుర్రపు స్వారీ కేంద్రం మంజూరు
- గిరిజన సైనిక్‌స్కూల్ ప్రారంభోత్సవంలో మంత్రి సత్యవతి
- పాల్గొన్న ఎంపీ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
ఖానాపురం : గిరిజనుల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, విద్యతోనే గిరిజన బిడ్డలు వృద్ధిలోకి వస్తారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం మండలంలోని అశోక్‌నగర్‌లో దేశంలోనే తొలి గిరిజన సైనిక్స్కూల్తోపాటు యు ద్ధట్యాంక్, రాడార్‌ను మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సత్యవతి మాట్లాడుతూ.. దేశంలో మరెక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన గిరిజన సైనిక్‌స్కూల్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి అత్యున్నత ప్రమాణాలు కలిగిన పాఠశాలలో సీటు పొందిన విద్యార్థులు క్రమశిక్షణతో చదివి రాష్ర్టానికి మం చి పేరు తీసుకురావాలన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకులాలను ప్రవేశపెట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి ఏటా రూ.1.20లక్షలు ఖర్చు చేస్తున్నదని అన్నారు. గురుకులాల్లో చదివే గిరిజన విద్యార్థులకు నీట్లో శిక్షణ ఇప్పిస్తే 40మంది మెడిసిన్‌లో సీటు సాధించారని తెలిపా రు. అందుకు గురుకుల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన కృషిని కొనియాడారు. అశోక్‌నగర్ సైనిక్స్కూల్లో త్వరలో రూ.6.5కోట్లతో గుర్రపు స్వారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మూడు చెక్కలపల్లి ఆశ్రమ పాఠశాల అప్‌గ్రేడ్, నర్సంపేటలో గిరిజన మహిళా రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గిరిజనులకు పాడిపశువులను ఇచ్చే నూతన కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. రూ. 117కోట్లతో గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ 3వ ఫేజ్‌కు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారని, త్వరలో పను లు కూడా ప్రారంభిస్తామన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. గిరిజన పిల్లలు ఎక్కువగా బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్‌గా మాత్రమే ఎంపికవుతుంటారని, వారికి శిక్షణ ఇచ్చి సైనికాధికారులుగా ఎదిగేందుకు గిరిజన సైనిక్‌స్కూల్ దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరిత, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, జడ్పీఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న , సర్పంచ్ గొర్రె కవిత, వైస్ ఎంపీపీ రామసాయం ఉమారాణి, సైనిక్‌స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, కల్నల్ సీఎన్ రెడ్డి , ప్రిన్సిపాల్ రాజూనాయక్, ఆర్సీవో వెంకన్న పాల్గొన్నారు.
తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం
బయ్యారం : తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు దేశానికే ఆదర్శమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం ఆమె మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన హాస్టల్ భవనం, నామాలపాడులో రూ.17 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఏకలవ్య మోడల్ స్కూల్ భవనానికి తెలంగాణ గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కలెక్టర్ గౌతమ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జడ్పీ చైర్పర్సన్ బిందుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ వందకుపైగా గురుకులాలు ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు కల్పించారని అన్నారు. బయ్యారం వంటి వెనుకబడిన ప్రాంతానికి ఏకలవ్య పాఠశాల రావడం సంతోషంగా ఉందన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఇల్లందు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు గోదావరి జలాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మౌనిక, సొసైటీ చైర్మన్ మధుకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గణేశ్, సర్పంచ్ కిరణ్, ఎంపీటీసీ ఉపేంద్ర, తహసీల్దార్ తరంగిణి, ఎంపీడీవో చలపతిరావు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మరో నాలుగు రోజులు..
- గ్రామాల అభివృద్ధేప్రభుత్వ ధ్యేయం
- ‘పట్టభద్రుల’ ఓటర్లు 4,91,396
- నేటి నుంచి నిరంతరాయంగా..
- ఆకాశం హద్దుగా!
- పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
- కోడేరు అభివృద్ధ్దికి కంకణం కట్టుకున్నా
- ప్రభుత్వభూమి ఆక్రమణపై హైకోర్టును ఆశ్రయిస్తాం
- కాళేశ్వరంలో మళ్లీ జలసవ్వడి
- నల్లమల ఖ్యాతి నలుదిశలా విస్తరించాలి