యథేచ్ఛగా నిర్మాణాలు

- రూ. 2 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం
- హరితహారం మొక్కల తొలగింపు
- చోద్యం చూస్తున్న అధికారులు
నల్లబెల్లి, డిసెంబర్ 16: ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నది. కొందరు హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సైతం తొలగించి యథేచ్ఛగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. కోట్ల రూపాయల విలువైన భూమి ఆక్రమణకు గురవుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని అర్శనపెల్లి గ్రామ శివారు బోల్లోనిపల్లి (పోచంపల్లిగడ్డ) సమీపంలోని సర్వే నంబర్ 288లో 2.8 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన పలకల శ్రీధర్‌రెడ్డి బోల్లోనిపల్లికి చెందిన నిరుపేదలకు బీసీకాలనీ నిర్మించేందుకు నాటి బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి 1994లో విక్రయించాడు. ప్రభుత్వం ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి పట్టాలు కూడా అందించింది. కానీ, లబ్ధిదారులు ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టబోమని చెప్పడంతో ఆ భూమి అప్పటి నుంచి నిరూపయోగంగా ఉంది. దీంతో మొదటి విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా 2016 జూలై 18న నాటి కలెక్టర్ ఆదేశాల మేరకు 2.8 ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్థలంలో అప్పటి డీఆర్వో శోభారాణి, నర్సంపేట ఆర్డీవో రామకృష్ణారెడ్డి, ఎంపీపీ బానోత్ సారంగపాణి, తహసీల్దార్ రాజేంద్రనాథ్, బోల్లోనిపల్లి సర్పంచ్ పోలుదాసరి నీలిమల నేతృత్వంలో మొక్కలు నాటారు. వర్క్ ఐడీ నంబర్ 70564లో రూ. 20,091 సైతం మొక్కల పెంపకానికి కూలీలకు డబ్బులను ఈజీఎస్ అధికారులు చెల్లించారు.
సర్కారు జాగాలో అక్రమ నిర్మాణాలు..
నేడు ఆ స్థలంలో ఉన్న మొక్కలను కొందరు తొలగించి ఆక్రమించుకొని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. సర్కారు భూమి అన్యాక్రాంతం అవుతున్నదని రెవెన్యూ అధికారులకు తెలిపినా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా కాపాడి, ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీవో కూచన ప్రకాశ్‌ను వివరణ కోరగా హరితహారంలో నాటిన మొక్కలను తొలగించి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
తాజావార్తలు
- హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
- తాండవ్ నటీనటులపై కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు
- కాంగ్రెస్ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్‌కు.. లేదంటే గెహ్లాట్‌కు!
- తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు
- టీమిండియాకు ఘన స్వాగతం
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి.. కంగనా విషెస్
- నేడు ఐసెట్ మూడో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
- కుటుంబ కలహాలతో.. భార్య, కుమార్తెను చంపిన భర్త
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్
- బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త