పశు గ్రాసం తోసంపద..

- వరికోత యంత్రాలతో తప్పని ఇబ్బందులు
- కట్టలు కట్టేందుకు ‘బేలర్'ను వినియోగిస్తున్న రైతులు
- గడ్డి నిల్వలకు యత్నం
నర్సంపేట : పశువులకు ఆహార నిల్వలు పెంచుతున్నారు. పశుగ్రాసం సమృద్ధిగా ఉంటేనే పశుసంపద కూడా వృద్ధి చెందుతుంది. ఇటీవల కాలం లో రైతులు వరి నూర్పిడి చేసేందుకు ఎక్కువగా యంత్రాలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల గడ్డి ముక్కలు ముక్కలుగా మారడంతో కట్టలు కట్టడం కూలీలతో సాధ్యపడకపోవడంతో పొలాల్లోనే వదిలేస్తున్నారు. దీంతో కొన్నేళ్లుగా పశుగ్రాసానికి కొరత ఏర్పడుతున్నది. పశు సంపదను కాపాడుకునేందుకు కొందరు రైతులు కూలీలతోనే వరి కల్లాలు నిర్వహిస్తూ, వచ్చే గడ్డిని నిల్వ చేస్తున్నారు. ఇటీవల ముక్కలైన గడ్డిని కూడా కట్టలు కట్టే యంత్రం బేలర్ రావడంతో రైతులు ఆ యంత్రాన్ని ఉపయోగిస్తూ వరిగడ్డిని కట్టలు కట్టించే పనిలో నిమగ్నమయ్యారు.
బేలర్‌తో వరిగడ్డి కట్టలు..
బేలర్ యంత్రాన్ని ట్రాక్టర్ ఇంజిన్‌కు వెనుక అమర్చి పొలంలో తిప్పుతే గడ్డిని లాక్కొని కట్టలు కడుతున్నది. అయితే కొన్నేళ్ల నుంచి కూలీలు వరి పంటను కోసి మెదవేసి, కట్టలు కట్టడం, కుప్పలు వేయడం, నూర్పిడిలు చేసే పనులు ఉండేవి. ఇదంతా జాప్యం అవుతున్నదని భావిస్తున్న రైతు లు పంట ఎండగానే యంత్రంతో కోయిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పశుగ్రాసం కొరతగా ఏర్పడుతున్నది. దీనివల్ల పశు సంపద కూడా తగ్గిపోతున్నది. గతంలో రైతులు వరిగడ్డిని నిల్వ చేసుకునేవారు. వరికోత యంత్రాల ద్వారా వరిగడ్డి నిల్వలు ఉండటం లేదని రైతులు పేర్కొం టున్నారు. బేలర్‌తో ఈ సమస్య తీరనుంది.
కట్టకు రూ.35 ఖర్చు
బేలర్ యంత్రం ఎకరానికి 50 నుంచి 60 గడ్డి కట్టలు కడుతున్నది. ఒక్కో కట్టకు రైతు రూ.35 అందిస్తున్నారు. వరిగడ్డి కట్టలు కొనుగోలు చేయాలంటే కట్టకు రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా వరి గడ్డిని కట్టలు కట్టించడం వల్ల ఎకరానికి బేలర్కు ఖర్చు రూ.1750 నుంచి రూ. 2100 వరకు అవుతున్నది. బేలర్ ఒక రోజు ఎనిమిది ఎకరాల వరకు గడ్డి కట్టలు కడుతుంది. నర్సంపేట ప్రాంతంలో ఇప్పటికే కొందరు రైతులు ఈ యంత్రాలను ఉపయోగిస్తున్నారు.
వరిగడ్డి నిల్వలకు రైతుల యత్నం
వరిగడ్డి, పశుగ్రాసం నిల్వలు తగ్గుతున్నాయి. దీనివల్ల పశు సంపద కూడా తగ్గుముఖం పడుతున్నది. గతంలో ప్రతి రైతు ఇంట్లో వ్యవసాయానికి ఉపయోగపడే ఎద్దుల జతలు, పాడి కోసం గెదే లు, దూడలు వంటివి ఉండేవి. గ్రాసం కొరత తీవ్రరూపం దాల్చడంతో రైతులు కూడా క్రమేణా పశు సంపదను అంగట్లో అమ్మేస్తున్నారు. అవసరమున్న రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణాలకు చెందిన కొందరు రైతులు, డైరీ కేంద్రాల నిర్వాహకులు, ఇతర రైతులు వరిగడ్డిని ఏటా కొనుగోలు చేసి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. వరిగడ్డి అవసరం లేని రైతులు కూడా బేలర్ సహాయంతో కట్టలు కట్టించి విక్రయిస్తున్నారు. కొంద రు రైతులు వరికట్టలను ఇంటి ఆవరణలో నిల్వ చేస్తున్నారు. గ్రాసంగా ఉపయోగిస్తున్నారు.
పశుగ్రాసాన్ని కట్టలు కట్టిస్తున్నాం
పొలంలో పశుగ్రాసా న్ని కట్టలు కట్టిస్తున్నాం. వరికోత యంత్రాలు వ చ్చిన తర్వాత పశువులకు మేత కష్టమవుతున్నది. ఎద్దులు, పాడి గెదేలకు ఇతర ఆవులు, దూడలకు ఆహారం కొరత ఏర్పడుతున్నది. వరికోత యంత్రం వల్ల గడ్డి ముక్కలవడంతో బేలర్ సహాయంతో కట్టలు కట్టించి నిల్వ చేసుకుంటున్నాం. పశుగ్రాసం ఎక్కువైతే ఇతర ప్రాంతాల రైతులకు విక్రయిస్తున్నాం.
-కుస్మ కోటేశ్వర్
తాజావార్తలు
- చెన్నైలో క్వారంటైన్లో బెన్‌స్టోక్స్
- పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
- ఈరోజు మీకు, మాకు ఎంతో ప్రియమైన రోజు: స్కాట్ మోరిసన్
- ట్రాక్టర్ పరేడ్ : ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- సైకో కిల్లర్ రాములు అరెస్టు
- టీఎంసీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం
- పాత వాహనాలపై 'గ్రీన్ టాక్స్'
- ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా
- ఫ్లోరిడాలో ఆఫీసు తెరిచిన ట్రంప్
- 'ఉప్పెన' విడుదలకు టైం ఫిక్స్..!