రద్దు చేసేంత వరకూ పోరాడుతాం

- రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ సర్కార్
- పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల : బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంత వరకూ పోరాడుతామని, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలుస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం పరకాల పట్టణంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్‌లో భాగంగా అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన రాస్తారోకోలో కన్నెబోయిన రాజయ్య యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతుల నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ చట్టాలతో వ్యవసాయం కార్పొరేట్ చేతుల్లోకి పోయి, రైతులు కూలీలుగా మారుతారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి రైతును రాజు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తుంటే ప్రధాని మోదీ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తున్నారని విమర్శించారు. రైతన్నలను కష్టపెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదని, రానున్న రోజుల్లో బీజేపీకి దేశంలో స్థానం ఉండదన్నారు. జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్‌కు వస్తున్న మద్దతును చూసి ప్రధాని మోదీ భయపడుతూ రాష్ట్రానికి వచ్చే నిధులను ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకూ టీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందన్నారు. రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొచ్చు వినయ్, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ, వైస్‌చైర్మన్ రేగూరి విజయపాల్‌రెడ్డి, పరకాల, నడికూడ ఎంపీపీ, జెడ్పీటీసీలు, తక్కళపల్లి స్వర్ణలత, మచ్చ అనసూర్య, సిలివేరు మొగిలి, కోడెపాక సుమలత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొజ్జం రమేశ్, వైస్ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, మాదారం, పరకాల పీఏసీఎస్ చైర్మన్లు గుండెబోయిన నాగయ్య, నల్లెల్ల లింగమూర్తి, మున్సిపల్ కౌన్సిలర్లు మడికొండ సంపత్ కుమార్, ఒంటేరు సారయ్య, దామెర మొగిలి, ఏకు రాజు, బండి సారంగపాణి, చందుపట్ల రమణారెడ్డి, పావుశెట్టి వెంకటేశ్వర్లు, చందుపట్ల రాజేందర్‌రెడ్డి, చందుపట్ల తిరుపతిరెడ్డి, పసుల రమేశ్, మార్క రఘుపతి, నల్లెల్ల అనిల్, అడప రాము పాల్గొన్నారు.
గూడెప్పాడ్ జంక్షన్లో..
ఆత్మకూరు : మండలంలోని గూడెప్పాడ్ జంక్షన్లో ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు భారత్ బంద్‌కు మద్దతుగా ఆందోళన, ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొని కార్యకర్తలతో కలిసి నినాదాలు చేశారు. అరగంట పాటు ధర్నా జరగడంతో రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయయాయి. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కన్నెబోయిన రాజయ్యయాదవ్, ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక, మార్కెట్ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు గండు రాము, రైతు మండల కోఆర్డినేటర్ రవీందర్, ఆత్మకూరు, దామెర వైస్ ఎంపీపీలు రేవూరి సుధాకర్‌రెడ్డి, జాకీర్‌అలీ, టీఆర్ఎస్ ఆత్మకూరు, దామెర మండలాల అధ్యక్షులు లేతాకుల సంజీవరెడ్డి, నేరెళ్ల కమలాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి అర్షం మధుకర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- మహా సర్కార్ లక్ష్యంగా పీఎంసీ దర్యాప్తు: ఎమ్మెల్యే ఇండ్లపై ఈడీ దాడులు
- గౌడ సంఘాల నాయకులకు జీఓ కాపీ అందించిన మంత్రి
- రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి హరీశ్ రావు
- ఆస్పత్రి నుంచి కమల్‌హాసన్ డిశ్చార్జ్
- 12 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు..
- కుమారుడ్ని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్న తల్లికి బెయిల్
- ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ నూతన మేయర్ ఎన్నిక
- ఐఫోన్ 13 సిరీస్‌లో హాట్ ఫీచర్స్
- ఈ టెక్నాలజీ నాశనం...!
- ఓడ్ కులస్తుల క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మంత్రి అల్లోల