మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Dec 08, 2020 , 02:35:15

రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

  • నేటి భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలి
  • ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల : రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో నేడు జరుగుతున్న భారత్‌ బంద్‌కు పూర్తి మద్దతు తెలుపుతున్నామని, రైతులకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిలుస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్నం పెట్టే రైతన్నకు కేంద్ర ప్రభుత్వం సున్నం పెడుతున్నదని, రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తున్న అన్నదాతలకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. రైతులను రాజులుగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మంగళవారం పరకాల పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో ధర్నా నిర్వహిస్తామని, పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజాప్రతినిధులు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.

అర్ధనగ్న ప్రదర్శన..

నర్సంపేట : మోదీ నల్లచట్టాలను నిరసించాలని ఏఐకేఎస్‌సీసీ జిల్లా కన్వీనర్‌ పెద్దారపు రమేశ్‌ కోరారు. రైతులకు మద్దతు తెలుపుతూ నర్సంపేటలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వానికి రైతులపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా తక్షణమే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేయాలన్నారు. రైతులకు వ్యతిరేకంగా రూపొందించిన స్వేచ్ఛా మార్కెట్‌ ఒప్పంద వ్యవసాయం, నూతన విద్యుత్‌ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కోరారు. 

సంపూర్ణ మద్దతు..

భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. నర్సంపేటలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక బిల్లు వల్ల దేశంలో 80 శాతం ఉన్న సన్న, చిన్నకారు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లభారతి, హమాలీ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి లక్ష్మీనారాయణ, భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు పాలడుగు రమేశ్‌, టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా సీనియర్‌ నాయకుడు గుండెబోయిన కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

విజయవంతం చేయాలి...

చెన్నారావుపేట : భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని ఎంపీపీ బదావత్‌ విజేందర్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నేడు నిర్వహించనున్న భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎస్‌ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ బుర్రి తిరుపతి, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు చెరుకుపల్లి విజేందర్‌రెడ్డి, సర్పంచ్‌ అనుముల కుమారస్వామి, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు మహ్మద్‌ రఫీ, పిండి భిక్షపతి, జున్నుతుల శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే కేంద్ర పభుత్వం ప్రవేశపెట్టిన భూ సంస్కరణల చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అక్కల్‌చెడ సర్పంచ్‌ తూటి పావని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు ధర్మపురి అరవింద్‌, సోయం బాబురావు పార్లమెంట్‌లో ఓటు వేసి భూసంస్కరణల చట్టాన్ని తీసుకువచ్చారని, వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. బంద్‌కు మాలమహానాడు, ఏఐఎఫ్‌డీఎస్‌  సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ సంఘాల జిల్లా అధ్యక్షుడు సాదు నర్సింగరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు జన్ను రమేశ్‌ అన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి కునమల్ల కమలాకర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు పోతరాజు నర్సయ్య, డివిజన్‌ అధ్యక్షుడు పత్రి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఖానాపురంలో..

ఖానాపురం : భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని ఓడీసీఎంఎస్‌ ఛైర్మన్‌ గుగులోత్‌ రామస్వామినాయక్‌, అఖిలపక్ష రైతు నాయకులు పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రం దిగివచ్చి చట్టాలను మార్చేవరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ కుంచారపు వెంకట్‌రెడ్డి, అఖిలపక్ష నాయకులు వీరేశ్‌, రాంచందర్‌, కృష్ణ, అశోక్‌, స్వామి, సోమయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరులో..

ఆత్మకూరు : బంద్‌ను విజయవంతం చేయాలని గూడెప్పాడ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాంతాల కేశవరెడ్డి అన్నారు. మండలంలో జరిగే ధర్నా కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ రవీందర్‌, అంబాటి రాజస్వామి, మాజీ జడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి పాల్గొన్నారు.

శాయంపేటలో..

శాయంపేట : రైతులు తలపెట్టిన భారత్‌ బంద్‌ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి తెలిపారు. మండలంలోని మాందారిపేట స్టేజీ వద్ద చేపట్టనున్న ధర్నా, రాస్తారోకోకు జడ్పీ చైరపర్సన్‌ గండ్ర జ్యోతి హాజరవుతారని చెప్పారు.   

దుగ్గొండిలో..

దుగ్గొండి : బంద్‌ను విజయవంతం చేయాలని జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమల, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ పొన్నం మొగిలి, వైస్‌ ఎంపీపీ పల్లాటి జైపాల్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ తోకల నర్సింహారెడ్డి, ఎన్నారై రాజ్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు ఊరటి మహిపాల్‌రెడ్డి, గుడిపెల్లి రాంరెడ్డి, టీజీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండెకారి రంగారావు, రజినీకర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సింగతి కార్తీక్‌, ఇన్‌చార్జీలు మేరుగు  రాంబాబు,  నీలం పైడయ్య  తదితరులు పాల్గొన్నారు.

ప్రతి కార్యకర్త పాల్గొనాలి.. 

నర్సంపేట రూరల్‌ : భారత్‌ బంద్‌లో మండలంలోని టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని మండలాధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదన్నారు. కార్యక్రమంలో నాయకులు అల్లి రవి, రాజ్‌కుమార్‌, రాజు, దేవేందర్‌, కుమారస్వామి, రమేశ్‌, నవీన్‌, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

నల్లబెల్లిలో.. 

నల్లబెల్లి : భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని మాజీ ఎంపీపీ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు డాక్టర్‌ బానోత్‌ సారంగపాణి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లును తీసుకొచ్చిందన్నారు. నాయకులు పాల్గొన్నారు. 

సంగెంలో.. 

సంగెం : నేటి భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని ఎంపీపీ అనిమిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మునావత్‌ నర్సింహనాయక్‌ కోరారు. రైతులకు అందరూ మద్దతు పలుకాలన్నారు. సమావేశంలో జిల్లా నాయకుడు బిల్లా సుధీర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ ఆకుల సురేందర్‌రావు, సర్పంచ్‌ గారె నర్సయ్య, సొసైటీ చైర్మన్‌ కుందూరు రాంచంద్రారెడ్డి, మండల నాయకులు ఎండీ ఉస్మాన్‌, మచ్చ సత్యం, తాళ్లపల్లి సంతోష్‌గౌడ్‌, ఎండీ నయీం, సుధాకర్‌, చందు రాము యాదవ్‌, వీరస్వామి, కాశీనాథ్‌, వసుంధర్‌ నాయక్‌ పాల్గొన్నారు.

సంగెం : నేడు జరిగే భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ కందకట్ల నరహరి రైతులకు పిలుపునిచ్చారు. రైతాంగాన్ని ఆగం చేసే నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు న్యాయ పోరాటం చేద్దామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నేడు జరిగే భారత్‌ బంద్‌ను విజయవంతం చేసి రైతుల పక్షాన నిలువాలన్నారు.

బైక్‌ర్యాలీ..

పరకాల : భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సోమవా రం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చై ర్‌పర్సన్‌ సోదా అనితారామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాలతో రైతుల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రేగూరి విజయపాల్‌ రెడ్డి, ఐఆర్‌సీఎస్‌ జిల్లా సభ్యుడు బండి సారంగపాణి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆముదాలపల్లి అశోక్‌, నాయకులు చందుపట్ల రమణారెడ్డి, పావుశెట్టి వెంకటేశ్వర్లు, పసుల రమేశ్‌, మార్క రఘుపతి, అడప రాము, నల్లెల్ల అనిల్‌, బొచ్చు వెంకటేశ్‌, దుప్పటి సాంబశివుడు, విష్ణువర్ధన్‌, వీరేశ్‌రావు, బం డి రమేశ్‌, నాగరాజు, నరేశ్‌ జెమిని, సు భాశ్‌ పాల్గొన్నారు.

అందరూ భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

వర్ధన్నపేట : కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాలు చేపడుతున్న బంద్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భాగస్వాములు కావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టాల వల్ల పంటలకు మద్దత ధర లభించదన్నారు. విద్యుత్‌ను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనివల్ల తెలంగాణలో రైతులు ప్రతి నెలా బిల్లులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమాతో రైతులు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారన్నారు. కానీ కేంద్రం తయారు చేసిన చట్టాలు అమలులోకి వచ్చినట్లయితే తెలంగాణ రైతాంగం మరోసారి ఇబ్బందులకు గురికానున్నదన్నారు. మంగళవారం జరుగనున్న జాతీయ రహదారుల దిగ్బంధనం, రాస్తారోకోలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో జాతీయ రహదారిపై చేపట్టనున్న ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు తరలి రావాలని ఎమ్మెల్యే రమేశ్‌ పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అరుణ, వైస్‌ చైర్మన్‌ ఏలేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజేశ్‌ఖన్నా, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి పాల్గొన్నారు.logo