పల్లె ప్రకృతి వనాలతో ప్రజలకు ప్రశాంతత

ఎంపీపీ మోతె కళావతి
నర్సంపేట రూరల్, డిసెంబర్ 7 : పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో ప్రజలకు ప్రశాంత వాతావరణం లభిస్తుందని ఎంపీపీ మోతె కళావతి అన్నారు. సోమవారం మండలంలోని రాజపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని ఎంపీపీ మోతె కళావతి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ప్రకృతి వనంలో మొక్క నాటి నీళ్లు పోశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నామాల భాగ్యమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రభుత్వ న్యాయవాది గూళ్ల అశోక్‌కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ కొర్ర ఉపేందర్, ఉప సర్పంచ్ నూనె నర్మద, పంచాయతీ కార్యదర్శి రాజమౌళి, వార్డు సభ్యులు గూళ్ల మాధవి, పసునూరి అరుణ, మల్లాడి అనసూర్య, గూళ్ల మంజుల, పొన్నం మౌనిక, సముద్రాల పుషమ్మ, పొన్నం వనమ్మ, కారోబార్ కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు మోతె పద్మనాభరెడ్డి, రమేశ్, రాజు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధికి సహకరించాలి..
గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీపీ మోతె కళావతి, రాజపల్లి సర్పంచ్ నామాల భాగ్యమ్మ, మాజీ ఎంపీటీసీ నామాల సత్యనారాయణ అన్నారు. మండలంలోని రాజపల్లి పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యురాలు నూనె నర్మద పాల్గొన్నారు. మండలంలోని ఇటుకాలపల్లిలో జరిగిన గ్రామ సభలో సర్పంచ్ మండల రవీందర్, ఎంపీటీసీ భూక్య వీరన్న మాట్లాడారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ జమాండ్ల చంద్రమౌళి, కార్యదర్శి కందుల అజయ్‌కుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్
- రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణకు చర్యలు