బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Dec 07, 2020 , 02:21:45

అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి

అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి

  • మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి
  • రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
  • జిల్లావ్యాప్తంగా బాబా సాహెబ్‌ వర్ధంతి

గీసుగొండ, డిసెంబర్‌ 6: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ను యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని శాసన సభ మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. అంబేద్కర్‌ వర్ధంతిని ఆదివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మండలకేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహానికి  పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్‌ గొప్ప మానవతావాది అని కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కర్ణకంటి రామ్మూర్తి, టీఆర్‌ఎస్‌ నాయకులు తప్పరి నర్సింహస్వామి, కిష్టయ్య, శంకర్‌, కృష్ణమూర్తి, రామస్వామి పాల్గొన్నారు. అలాగే, అంబేద్కర్‌కు టీఆర్‌ఎస్‌ నాయకుడు సుంకరి శివ, గీసుగొండ సర్పంచ్‌ దౌడు బాబు, సీఐ వెంకటేశ్వర్లు, నవీన్‌రాజు, ఎమ్మార్పీఎస్‌, అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు నివాళులర్పించారు.

నర్సంపేట: మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సాధు నర్సింగరావు పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. నాయకులు కమలాకర్‌, పోతరాజు నర్సయ్య, కుమారస్వామి, యాకయ్య, నర్సింగం, స్వామి పాల్గొన్నారు. ఆర్టీసీ బస్‌డిపోలో అంబేద్కర్‌ చిత్రపటానికి డీఎం శ్రీనివాసరావు నివాళులర్పించారు. లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గోపాల్‌, డాక్టర్‌ జయుడు, డాక్టర్‌ భరత్‌రెడ్డి పాల్గొన్నారు.

పరకాల: అంబేద్కర్‌ సెంటర్‌లో సీఐ మహేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సోదా అనితా రామకృష్ణ అంబేద్కర్‌ విగ్రహానికి నివాళుర్పించారు. రేగూరి విజయపాల్‌రెడ్డి, గోవిందు సురేశ్‌, బండి సారంగపాణి, సిలివేరు మొగిలి, ఏకు రాజు, నల్లెల్ల లింగమూర్తి, పసుల రమేశ్‌, మార్క రఘుపతి, గొర్రె రాజు, బొచ్చు వెంకటేశ్‌, బొచ్చు కుమార్‌, దుప్పటి సాంబశివుడు, ఏకు సుధాకర్‌, నక్క చిరంజీవి, గోవిందు జితేందర్‌, రవీందర్‌, ఏకు రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట రూరల్‌: అంబేద్కర్‌ చిత్రపటానికి టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, పలువురు  నాయకులు నివాళులర్పించారు. ఎంపీపీ మోతె కళావతి, నాయకులు మోతె పద్మనాభరెడ్డి, ఈర్ల నర్సింహరాములు,  మచ్చిక రాజుగౌడ్‌, అల్లి రవి, గంధం జగన్మోహన్‌రావు, భూక్యా వీరన్న, బక్కి వెంకటేశ్వర్లు, కుసుంబరావు, కోటి పాల్గొన్నారు. పాతముగ్ధుంపురం జీపీ కార్యాలయంలో ధర్మనిధి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్ధంతి నిర్వహించారు. సంస్థ కో ఆర్డినేటర్‌ దబ్బేట శ్రీనివాస్‌, సదిరం రాజు, సుంకరి సురేశ్‌, ఆలువాల అశోక్‌, సుంకరి రాజు, మాదాసి రమేశ్‌, లక్క కుమారస్వామి, సుంకరి సాంబయ్య, భిక్షపతి, బాబు, స్వామి పాల్గొన్నారు.

దామెర: ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీటీసీ గరిగె కల్పన, ఎంపీటీసీలు పోలం కృపాకర్‌రెడ్డి, గోవిందు సంధ్య, సర్పంచ్‌లు వడ్డెపల్లి శ్రీనివాస్‌, గోవిందు అశోక్‌, ఎంపీడీవో యాదగిరి, విద్యుత్‌ ఏఈ శిరీశ్‌కుమార్‌ అంబేద్కర్‌కు నివాళులర్పించారు. పులుకుర్తిలో ఎంఎస్‌ఎఫ్‌ పరకాల నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ జిల్లెల ముగిలి, ఈదునూరి స్వామి, దండు రాజు, సర్పంచ్‌ అశోక్‌, ఉపసర్పంచ్‌ మెంతుల రాజు, ఊరుగొండలో టీఆర్‌ఎస్వీ నాయకులు అక్కెళ్ల ప్రశాంత్‌, జన్ను సాంబయ్య అంబేద్కర్‌ చిత్రపటాలకు నివాళులర్పించారు. దామెర, ముస్త్యాలపల్లి, ఓగ్లాపూర్‌, పసరగొండలో టీఆర్‌ఎస్‌ నాయకులు సిలివేరు నర్సయ్య, బండి అశోక్‌, గరిగె కృష్ణమూర్తి, కార్యదర్శి నరేశ్‌ పాల్గొన్నారు.

దుగొండి: చలపర్తి, శివాజీనగర్‌, వెంకటాపురం, మదిర, ముద్దునూరు, తిమ్మంపేట, రేఖంపల్లిలో అంబేద్కర్‌ వర్ధంతి నిర్వహించారు. సర్పంచ్‌లు ముదరుకోళ్ల శారద-కృష్ణ, లింగంపల్లి ఉమ-రవీందర్‌రావు, మోడెం విద్యాసాగర్‌గౌడ్‌, రేవూరి సురేందర్‌రెడ్డి, ఇమ్మడి యుగేంధర్‌, ఎరుకొగం కరుణాకర్‌, లింగారెడ్డి, రమేశ్‌, మోహన్‌రావు, ఎలకంటి కుమారస్వామి, నర్సింహాస్వామి, సోని-రతన్‌ పాల్గొన్నారు.

చెన్నారావుపేట: ఎస్సై శీలం రవి, అంబేద్కర్‌ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాంకాల యాదగిరి, దళిత శక్తి ప్రోగ్రాం మండల కన్వీనర్‌ తాళ్ల అజయ్‌ మండలకేంద్రంలోని నంబర్‌వన్‌కాలనీ, పాపయ్యపేట, లింగగిరిలో అంబేద్కర్‌ చిత్రపటాలకు నివాళులర్పించారు. మాదారపు మాణిక్యం, కందిక సునీల్‌, జంగిలి కిరణ్‌, నర్మెట యాదగిరి, బొల్లెపల్లి మహేందర్‌, బర్ల దేవదానం, కన్నం మధు, సునీల్‌, వెంకటేశ్వర్లు, మహేందర్‌, నర్సింగరావు, నరేశ్‌, శ్రీను, భాస్కర్‌, వంశీ, వినయ్‌, అశోక్‌, దిలీప్‌, బాబు, నర్మెట ఈశ్వర్‌, మదాసి ప్రవీణ్‌ పాల్గొన్నారు.

శాయంపేట: బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్‌ వర్ధంతిలో ఎస్సై అకినపెల్లి ప్రవీణ్‌కుమార్‌ పాల్గొని శాయంపేట బస్టాండ్‌ కూడలిలోని అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. మారెపల్లి క్రాంతికుమార్‌, మొగ్గం సుమన్‌, మారెపల్లి మనోజ్‌కుమార్‌, సందీప్‌, రవీందర్‌ పాల్గొన్నారు. గట్లకానిపర్తిలో విక్టర్‌ యూత్‌ అధ్యక్షుడు బొమ్మకంటి శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో సర్పంచ్‌ బొమ్మకంటి సాంబయ్య, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామస్తులు అంబేద్కర్‌కు నివాళులర్పించారు.

వర్ధన్నపేట: మండలకేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహానికి ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆంగోత్‌ అరుణ, వైస్‌ చైర్మన్‌ ఎలేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజేశ్‌ఖన్నా, తూళ్ల కుమారస్వామి, మిద్దెపాక రవీందర్‌, రాజమణి, రామకృష్ణ, రవీందర్‌, సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

నడికూడ: నర్సక్కపల్లిలో అంబేద్కర్‌ విగ్రహానికి సర్పంచ్‌ తిప్పర్తి సాంబశివారెడ్డి నివాళులర్పించారు. పోనుగంటి అర్జున్‌ స్వేరో, ఉప సర్పంచ్‌ నాగుర్ల ధర్మారావు, కోడెపాక సమ్మయ్య, రవీందర్‌, భాస్కర్‌, జన్ను స్వామి, సదయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు. నడికూడలో దళిత శక్తి ప్రోగ్రాం మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చిత్రపటానికి  నివాళులర్పించారు. రత్నాకర్‌, సుమన్‌, ప్రతాప్‌, శ్యామ్‌, దిలీప్‌, విష్ణు, ప్రశాంత్‌, తిరుపతి పాల్గొన్నారు.

రాయపర్తి: ఊకల్‌లోని ఎస్సీకాలనీ కూడలిలో అంబేద్కర్‌ విగ్రహానికి ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, సర్పంచ్‌ కుంచారపు హరినాథ్‌, ఏఎస్సై మేకల లింగారెడ్డి వేర్వేరుగా నివాళులర్పించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఎంపీటీసీ అయిత రాంచందర్‌, పూస మధు, పోలెపాక భిక్షపతి, బొడ్డు రంగయ్య, పాము మనోహర్‌, అలువాల వెంకటయ్య, అశోక్‌, గొల్లపల్లి సదాశ్రీను, ఎల్లయ్య, శ్రీనువాస్‌, రాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.

నెక్కొండ: మండలకేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహానికి ఎంపీపీ జాటోత్‌ రమేశ్‌ నివాళులర్పించారు. మారం రాము, పుండరీకం, ఈదునూరి యాకుబ్‌, తహసీల్దార్‌ డీఎస్‌ వెంకన్న, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అబ్దుల్‌ నబీ, నాయకులు ఈదునూరి యాకయ్య, ఈదునూరి వెంకన్న, గారె శ్యాంప్రసాద్‌, ఈదునూరి రమేశ్‌, తాటికాయల యాకయ్య పాల్గొన్నారు. దీక్షకుంటలో సర్పంచ్‌ ఆలకుంట సురేందర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ఎంపీటీసీ లింగాల అజయ్‌, సొసైటీ డైరెక్టర్‌ శ్రీను, గుండె లక్ష్మయ్య, ముడుసు కొమ్మాలు తదితరులు పాల్గొన్నారు.

సంగెం: మండలకేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహానికి యువజన సంఘం అధ్యక్షుడు మెట్టుపల్లి సునీల్‌ ఆధ్వర్యంలో  ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, సీఐ పుల్యాల కిషన్‌, తహసీల్దార్‌ నంగునూరి రమేశ్‌, ఎస్సై సురేశ్‌ నివాళులర్పించారు. కందకట్ల నరహరి, సర్పంచ్‌ గుండేటి బాబు, ఎంపీటీసీ మల్లయ్య, వైస్‌ ఎంపీపీ బుక్క మల్లయ్య, కోడూరి సదయ్య, జీ కుమారస్వామి, వాసం సాంబయ్య, చిర్ర బాబు, ఆర్‌ఐ ఆనంద్‌కుమార్‌, సురేశ్‌, నల్లతీగల రవి, కుమార్‌, ఎల్లయ్య, చిర్ర బాబు పాల్గొన్నారు.

నల్లబెల్లి: మండలకేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో మాజీ ఎంపీపీ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు డాక్టర్‌ బానోత్‌ సారంగపాణి అంబేద్కర్‌కు నివాళులర్పించారు. మేడపల్లి సర్పంచ్‌ లావుడ్య తిరుపతి, అనుముల రఘుపతిరెడ్డి, చందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు: విశ్వరత్న సమాజ నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ఎంపీపీ మార్క సుమలత, యూత్‌ అధ్యక్షడు మామిడి మహేందర్‌, నీలం కుమార్‌, పెండ్యాల కరుణాకర్‌, దుప్పటి శంకర్‌ పాల్గొన్నారు. అలాగే, దళితశక్తి ప్రోగాం ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కొమ్ముల సురేశ్‌, తన్గుల సన్నికుమార్‌ పాల్గొన్నారు.

పర్వతగిరి: మండలంలోని కల్లెడలో అంబేద్కర్‌ విగ్రహానికి అంబేద్కర్‌ యూత్‌ అధ్యక్షుడు దాసరి అశోక్‌ నివాళులర్పించారు. జిల్లా నర్సయ్య, గడ్డం నరేందర్‌, చిన్నపాక శ్రీనివాస్‌, మధు, యాసారపు సురేశ్‌, రమేశ్‌, తక్కళ్లపల్లి ఐలయ్య పాల్గొన్నారు. గోపనపెల్లిలో అంబేద్కర్‌ సంఘం నాయకుడు జన్ను నర్సయ్య నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ధర్మయ్య, పోడేటి దయాకర్‌, బొట్ల దయాకర్‌, బొట్ల భాస్కర్‌, జిల్లా రమేశ్‌, వల్లందాసు కుమార్‌, మునిగె కుమారస్వామి, చిన్నపెల్లి శ్రీను, జిల్లా ముత్తయ్య, ఏ గణేశ్‌, వెంకన్న పాల్గొన్నారు.


logo