శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Dec 06, 2020 , 02:01:31

పేదరికంపై యుద్ధానికి చదువే ఆయుధం

పేదరికంపై యుద్ధానికి చదువే ఆయుధం

పరకాల: పేదరికంపై యుద్ధం చేయడానికి చదువే ఆయుధమని ఎంపీపీ స్వర్ణలత అన్నారు. మండలంలోని వెల్లంపల్లిలో జైభీమ్‌ విద్య ఫౌండేషన్‌ చైర్మన్‌ జన్ను రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘పల్లెపల్లెకు అంబేద్కర్‌ జ్ఞానయాత్ర’ కార్యక్రమంలో ఆమె పాల్గొని అంబేద్కర్‌ జీవిత చరిత్ర పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రతి పౌరుడు అంబేద్కర్‌ జీవిత చరిత్రను తెలుసుకోవాలని ఎంపీపీ సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎలగందుల కృష్ణ, ఉపసర్పంచ్‌ లత-విక్రమ్‌, పెండ్యాల సుమన్‌, రవీందర్‌, రవళి-అంబేద్కర్‌, బర్ల రవి, తిరుపతి, రవీందర్‌, నవీన్‌కుమార్‌, శరత్‌చంద్ర, విజేందర్‌, అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

విద్యార్థులకు నోట్‌బుక్స్‌ పంపిణీ

వర్ధన్నపేట: దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దిశ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు. హెచ్‌ఎం సదానందం మాట్లాడుతూ అమెరికాలో స్థిరపడిన దిశ ఫౌండేషన్‌ నిర్వాహకురాలు సుష్మిత జక్కిరెడ్డి సహకారంతో పేద విద్యార్థులకు సహకారం అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్‌ యాకయ్య, ఉపాధ్యాయులు రఘుపతి, శ్రీరాములు, సుదర్శనం, సురేశ్‌, సునీతాదేవి, సరస్వతి, అనితాబాయి పాల్గొన్నారు.

లక్ష్యాన్ని ఎంచుకుని చదువు కోవాలి

పరకాల: విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని చదువుకోవాలని జడ్పీటీసీ సిలివేరు మొగిలి అన్నారు. వెంకటాపూర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ యూనిఫాంతోపాటు దిశ ఫౌండేషన్‌ అందించిన నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్‌ సిలవేరు జితేందర్‌, హెచ్‌ఎం మహేందర్‌, టీచర్లు నాగెల్లి రాజేందర్‌, రాజేందర్‌ బాబు, పసుల సమ్మయ్య పాల్గొన్నారు.