కార్పొరేట్ శక్తులకు కేంద్రం దాసోహం

- ఏఐకేఎస్‌సీసీ జిల్లా కన్వీనర్ పెద్దారపు రమేశ్
- ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మల దహనం
- రైతులపై దమనకాండకు నిరసన
నర్సంపేట, డిసెంబర్ 5: కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం దాసోహమై రైతాంగాన్ని కట్టు బానిసలను చేసే చట్టాలను రూపొందిస్తున్నదని అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) జిల్లా కన్వీనర్ పెద్దారపు రమేశ్ ధ్వజమెత్తారు. రైతులపై దమనకాండను నిరసిస్తూ, రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రమేశ్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడి రైతు అనుకూల చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రతాపరెడ్డి, సూరి, పైడి, కుమార్, భాస్కర్, కొమురయ్య, ప్రణయ్‌దీప్, కుమారస్వామి, రాగసుధ, రమేశ్, రాజు, యాకయ్య, భద్రయ్య, బాలనర్సయ్య పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
దుగ్గొండి: దేశానికి అన్నం పెట్టే అన్నదాతల నడ్డి విరిచేలా ఉన్న చట్టాలను రద్దు చేయాలని ఎంపీపీ కాట్ల కోమల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని తొగర్రాయిలో టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీ ఎం అఖిలపక్షాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఎంపీపీ, తొగర్రాయి సర్పంచ్ ఓడేటి తిరుపతిరెడ్డి నిరసన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలు, యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలను మార్చడం దారుణమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కాంగ్రెస్, సీపీఎం నాయకులు కాట్ల భద్రయ్య, యార శ్రీనివాస్, రాస చేరాలు, నర్సింహారెడ్డి, కొమురయ్య, సాయని రాజు, బుస్సాని రాజు, కుమారస్వామి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పిల్లల డాక్టరైనా.. విచక్షణ కోల్పోయి..
- కొవిడ్ షాక్ : పసిడి డిమాండ్ భారీ పతనం
- సెంటిమెంట్ ఫాలో అవుతున్న వరుణ్ తేజ్..!
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కార్తీకదీపం ఫేమ్
- ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆప్ పోటీ
- వేగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ జరుపుతున్న దేశంగా భారత్
- చిల్లరిచ్చేలోపు రైలు వెళ్లిపోయింది... తరువాతేమైందంటే?..
- ఆ తీర్పు ఇచ్చింది జస్టిస్ పుష్పా వీరేంద్ర.. ఎవరామె ?
- తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- కేంద్రమే రైతులను రెచ్చగొట్టింది : శివసేన