యాసంగిలో ఆరుతడి, కూరగాయల పంటలు అనుకూలం

- మక్కజొన్నను సాగు చేయొద్దు
- జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్
కలెక్టరేట్ : ఈ సంవత్సరం యాసంగిలో ఆరుతడి పంటలు, కూరగాయల పంటలు సాగు చేయడానికి రూరల్ జిల్లాలోని నేలలు అనుకూలమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాళ్ రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆరుతడి పంటలైన వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమలు, పెసర, మినుములు, చిరు ధాన్య పంటలైన జొన్న, సజ్జ, రాగి, కొర్రలు, కూరగాయల పంటలకు జిల్లాలోని నేలలు అనుకూలమని తెలిపారు. రైతులందరూ నేలను బట్టి, నీటి వనరులను బట్టి అనువైన పంటలను ఎంపిక చేసుకుని సాగు చేయాలని సూచించారు. గత సంవత్సరంలో కొనుగోలు చేసిన మక్కజొన్న నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల దానికి మద్ధతు ధర లభించక రైతులు నష్ట పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వ సూచన మేరకు ఈ సారి యాసంగిలో మక్కజొన్న సాగు చేయవద్దని సూచించారు. కాగా, పెసర, మినుము, చిరుధాన్య పంటల విత్తనాలు కావాల్సిన రైతులు తమ క్లస్టర్ వ్యవసాయ శాఖ అధికారులను కలిసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. దీంతో జాతీయ ఆహార భద్రతా పథకం కింద రాయితీపై అర్హులైన వారికి విత్తనాలు సరఫరా చేయడంతోపాటు ఈ పథకం కింద అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకోవడానికి 50 శాతం రాయితీపై అకౌస్టిక్స్ కూడా సరఫరా చేయనున్నట్లు వివరించారు. రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తాజావార్తలు
- క్షమాపణ సరిపోదు.. అమెజాన్‌ను నిషేధిస్తాం : బీజేపీ
- లీటర్ పెట్రోల్ @ రూ. 85.. మరోసారి పెరిగిన ధర
- రుణయాప్ డైరెక్టర్లు చైనాకు..?
- గొర్రె, పొట్టేలుకు కల్యాణం.. ఎందుకో తెలుసా?
- సాయుధ దళాల సేవలు అభినందనీయం
- అడ్డుగా ఉన్నాడనే.. భర్తను హత్య చేసింది
- నగరి ఎమ్మెల్యే రోజా కంటతడి
- నేరాలకు ఎంటర్నెట్
- వరి నాటు వేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- ఆదిపురుష్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్