అక్కరొచ్చె పని చేయని మోడీ ప్రభుత్వం

- రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
- ఆర్థిక ఇబ్బంది ఉన్నా రైతులకు అండగా ఉన్నం
- కేంద్రం తెచ్చిన బిల్లులతో రైతు బతకలేడు
- పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
గీసుగొండ, డిసెంబర్ 4 : కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అక్కరొచ్చె ఒక్క పని కూడా చేయలేదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని విశ్వనాథపురంలో ఏర్పాటు చేసిన రైతు వేదికను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ముందుగా కొమ్మాలలో ఓడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం విశ్వనాథపురంలో పకృతి వనాన్ని ప్రారంభించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యేకు రైతులు, కార్యకర్తలు కోలాటం, డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు. కొమ్మాల స్టేజీ నుంచి రైతు వేదిక వరకు ఎమ్మెల్యే ఎడ్లబండి నడిపారు. రైతు వేదిక భవనం ప్రారంభించిన అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి పనిచేయలేదని విమర్శించారు. పన్నుల రూపంలో రాష్ర్టానికి రావాల్సిన రూ.200 కోట్లను కేంద్రం ఇవ్వడం లేదన్నారు. పైగా రాష్ట్రం ప్రభుత్వం చేసే ప్రతి పనిలో కేంద్రం వాటా ఉందని బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకోవ డం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రభు త్వం రైతులను రాజులుగా చేయాలనే మహా సంకల్పంతో పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకా లు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నా రు. కరోనా కష్ట కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఆపడం లేదన్నారు. గత పాలకులు రైతుల నుంచి శిస్తులు, పన్నులు వసూలు చేస్తే కేసీఆర్ మాత్రం రైతులకే తిరిగి పెట్టుబడి సాయం అందిస్తున్నారన్నారు. రైతులకు పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఉమ్మడి జిల్లాలో పరకాల నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేస్తాననారు. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులతో రైతులు బతకలేరన్నారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
కార్తీక మాసోత్సవాల్లో భాగంగా గ్రేటర్ రెండో డివిజన్ రెడ్డిపాలెంలోని మైసమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠమహోత్సవంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ బొమ్మినేని మాధవరెడ్డి, ఏడీఏ విద్యాసాగర్, ఎంపీటీపీ భూక్య హను ము, ఏవో హరిప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ దేవేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు అంకతి నాగేశ్వర్రావు, వీరాటి కవిత, బాదావత్ అమ్మి, కేలోతు సరోజ, వాంకుడోత్ రజిత, మక్కెన అశ్వినీ, జైపాల్‌రెడ్డి, బోడకుంట్ల ప్రకాశ్, మల్లయ్య, బాబు, అనిల్, రాజు, కార్పొరేటర్ బాలయ్య, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, ఊకల్ సొసైటీ వైస్ చైర్మన్ చల్లా కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు కూరపాటి వీరస్వామి, మార్కెట్ డైరెక్టర్ రఘు, నాయకులు గడ్డమీది కుమారస్వామి, రవీందర్‌రెడ్డి, స్వామిచౌహాన్, తిరుపతి, కొమురయ్య, వీరన్న, నాగయ్య, అర్చకులు శ్రీనివాసాచార్యులు, కాండూరి రామాచార్యులు, ఈవో కమల పాల్గొన్నారు.
విలీన గ్రామాల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
వరంగల్ : గ్రేటర్ విలీన గ్రామాల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవా రం కుడా కార్యాలయంలో గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి విలీన గ్రామాల అభివృద్ధి పనులపై సమీక్షించారు. పరకాల నియోజకవర్గం పరిధిలోని 2,3,4,5 డివిజన్లలోని గ్రామాల్లో పట్టణ ప్రగతి, సీఎం మామీ, జనరల్ ఫండ్లతో చేపట్టిన పనుల పురోగతిని తెలుసుకున్నారు. కౌన్సిల్ ఆమోదం పొందిన పనుల టెండర్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. పక్షం రోజుల్లో గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు ల్యాదల్ల బాలయ్య, లింగం మౌనిక, బిల్లా కవిత, ఎస్ఈ విద్యాసాగర్, ఈఈలు శ్రీనివాస్‌రావు, లక్ష్మారెడ్డి, రాజ్‌కు మార్, డీఈ రవీందర్, మనోహ ర్రావు, ఏఈలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- 31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్
- భారత్‌కు బయలుదేరిన మరో మూడు రాఫెల్స్
- రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
- 'ఏకగ్రీవాలు ఎన్ని ఎక్కువైతే అంత మంచిది'
- ధారావిలో కరోనా కేసులు నిల్
- ఏపీ సమాచార కమిషనర్‌కు ఎస్ఈసీ మెమో
- రిపబ్లిక్ డే హింస.. దేశానికే అవమానం : అమరిందర్ సింగ్
- తెలుగు సినీ ప్రముఖులకు వృక్షవేదం పుస్తకం అందజేత
- ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
- ‘తల్లిదండ్రుల సమ్మతి ఉంటనే పాఠశాలకు అనుమతి’