శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Dec 04, 2020 , 01:31:46

విస్తరణ పనుల్లో నిర్లక్ష్యమేల..?

విస్తరణ పనుల్లో నిర్లక్ష్యమేల..?

  • రోడ్డుకు అడ్డంగా విద్యుత్‌ స్తంభాలు
  • భూగర్భంలో కలిసిపోతున్న చేతి పంపులు

రాయపర్తి : రహదారుల విస్తరణ, నూతన రోడ్ల నిర్మాణ పనులకు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు అడ్డంకిగా మారుతున్నాయి. చేతి పంపులు భూగర్భంలో కలిసిపోతున్నాయి.  మండల కేంద్రం మీదుగా రూ. 42 కోట్ల ప్రత్యేక నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన పాలకుర్తి-రాయపర్తి-అన్నారం షరీఫ్‌ రోడ్డు విస్తరణ, డబుల్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో పలు ప్రభుత్వ చేతి పంపులు భూమిలో కలిసిపోయాయి. ఈ మార్గం మధ్యలో ఉన్న కొలన్‌పల్లి, కొండూ రు, రాయపర్తి, రాగన్నగూడెం, పెర్కవేడు గ్రామాల పరిధిలో రోడ్లకు ఇరువైపులా గతంలో వేసిన చేతి పంపులు భూమిలో కలిసిపోతున్నాయని, వేసవిలో నీటి ఎద్దడి తలెత్తితే తమకు దిక్కెవరంటూ మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఆం దోళన వ్యక్తం చేస్తునారు. ఈ గ్రామాల్లోనే రోడ్డు మధ్యలో విద్యుత్‌ స్తంభాలు ఉన్నాయని, వాటి వలన వాహనదారులు, ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉందన్ని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భూమిలో కలిసిపోతున్న చేతి పంపులను ప్రజలకు ఉపయోగపడే విధంగా మరమ్మతులు చేపట్టాలని, రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను తొలగించాలని మండల ప్రజలు కోరుతున్నారు. 


logo