పాకాల ఆధునీకరణ పనుల మేరకుయాసంగి సాగు చేపట్టాలి

- నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
- ఈ నెల 21 నుంచి తైబందీ నీటి విడుదల
- నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో సమీక్ష సమావేశం
నర్సంపేట, డిసెంబర్ 3 : పాకాల సరస్సు ఆధునీకరణ పనుల దృష్ట్యా యాసంగి సాగు తైబందీని నిర్ణయిస్తామని, రైతులు సకాలంలో సాగు పనులు మొదలు పెట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. గురువారం నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల శాఖ ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకాల ఆధునీకరణ దృష్ట్యా 2020లో 50 శాతం పనులు చేపట్టడానికి త్వరలో అనుమతులు రాబోతున్నాయన్నారు. ఈ మేరకు జరిగే అభివృద్ధి పనులకు అనుగుణంగా పాకాల సరస్సుకు తైబందీని నిర్ణయించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. అధికారులు నిర్ణయించిన మేరకే రైతులు యాసంగి పంట సాగు చేయాలని సూచించారు. డిసెంబర్ 21న నీటిని విడుదల చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆధునీకరణ పనుల నేపథ్యంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 15 తేదీ నీటి విడుదల నిలిపివేస్తామని చెప్పారు. రైతులు దీనికి అనుగుణంగా పంటలను పండించుకోవాలని సూచించారు. నీటి లభ్యతను బట్టి తైబందీని నిర్ణయిస్తారని, అధికారులకు సహకరించాలని కోరారు. అలాగే, మాదన్నపేట, రంగాయ చెరువుల తైబందీ మంజూరు విషయంలోనూ అధికారులు చొరవ చూపాలన్నారు. నుంచి రంగాయ చెరువుకు నీటిని మళ్లించే ప్రాజెక్టు కూడా ట్రయల్ రన్ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉందన్నారు. అందువల్ల రంగాయ చెరువుకు పూర్తి స్థాయిలో ఆయకట్టు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. సమావేశంలో నర్సంపేట ఆర్డీవో పవన్‌కుమార్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, డీఈ రాంప్రసాద్, ఏఈలు గోవర్ధన్, నితిన్, రత్నాకర్, ఖానాపురం ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దంపతులకు స్వాముల ఆశీర్వాదం
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, రూరల్ జడ్పీఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న దంపతులకు అయ్యప్ప ఆలయ కమిటీ బాధ్యులు, స్వాములు ఆశీర్వాదం అందించారు. ఈనెల 9న పంబా ఆరట్టు మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నర్సంపేటలోని మాదన్నపేట చెరువుకు స్వామిని తీసుకెళ్లి జలకాలాట, అభిషేకాలను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెద్ది దంపతులు దాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు కార్యక్రమానికి హాజరుకావాలని ఆయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు శింగిరికొండ మాధవశంకర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, స్వాములు, వేద బ్రాహ్మణులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే దంపతులను ఆహ్వానించారు. వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ పంబా ఆరట్టు నిర్వహణకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని, మహా అన్నదానాన్ని నిర్వహించాలని సూచించారు.
తాజావార్తలు
- యజమాని బాగు కోసం ఈ శునకం ఏం చేసిందంటే..
- చిన్న పరిశ్రమలకు ‘ఆలీబాబా’:డిజైన్‌పై ఫోకస్!
- జలుబు చేసినప్పుడు పెరుగు తింటున్నారా..
- స్ట్రాబెర్రీస్ తినడానికి చాలా కారణాలున్నాయ్.!
- తెలంగాణ సీఐ సృజన్‌రెడ్డికి జీవన్ రక్షా అవార్డు
- రైతన్నలకు శాల్యూట్ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- ఆన్ లైన్ లో అమ్మకానికి బిడ్డ ...!
- బొలెరో వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు
- బడ్జెట్ రోజున.. పార్లమెంట్ వైపు దూసుకెళ్తాం: రైతులు
- ఈ మందు టేస్ట్ సూపర్ గురూ..!