రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- ఏఎంసీ చైర్మన్, ఎంపీపీ
- పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
పరకాల: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొజ్జం రమే శ్ అన్నారు. మండలంలోని మల్లక్కపేట, పోచారం గ్రామా ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1,888, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.1,868మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్య లు తీసుకుంటున్నట్లు చెప్పారు. పరకాల, నడికూడ మండలాల్లో 17కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 16 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్న ట్లు తెలిపారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పరకాల, మాదా రం పీఏసీఎస్ సొసైటీ చైర్మన్లు గుండెబోయిన నాగయ్య, నల్లెల్ల లింగమూర్తి, మల్లక్కపేట సర్పంచ్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి ఎస్.శ్రీనివాస్, సొసైటీ సీఈవో రమేశ్‌బాబు, సొసైటీ డైరెక్టర్లు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రైతులకు అండగా నిలిచే ప్రభుత్వం
శాయంపేట : రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచే ప్రభు త్వం కొనసాగుతున్నదని, అధైర్య పడాల్సిన అవసరం లేదని పీఏసీఎస్ చైర్మన్ కుసుమ శరత్‌బాబు అన్నారు. మండలంలోని గట్లకానిపర్తిలో ఓడీసీఎంఎస్, వసంతాపూర్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటున్నదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ధాన్యపు గింజనూ ఇక్కడ అమ్ముకోవచ్చన్నారు. కార్యక్రమంలో పరకాల ఏఎంసీ చైర్మన్ బొజ్జం రమేశ్, వైస్ ఎంపీపీ రాంశెట్టి లతాలక్ష్మారెడ్డి, మాదారం పీఏసీఎస్ చైర్మన్ నల్లెల్ల లింగమూర్తి, సర్పంచ్‌లు బొమ్మకంటి సాంబ య్య, ముక్కెర అనూష, పీఏసీఎస్ సీఈవో గుర్రం రాజమోహన్, డైరెక్టర్ మహేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌లు మహేందర్, సురేందర్, టీఆర్ఎస్ గట్లకానిపర్తి అధ్యక్షుడు భూషబోయిన సురేశ్, నాయకులు ఇటుకాల పాపారావు, గుర్రం అశోక్, చెన్నబోయిన అజయ్‌కుమార్, హమాలీ సంఘం అధ్యక్షుడు కొయ్యడ రవి, రాజు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
పర్వతగిరి: మండలంలోని చింతనెక్కొండ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ లూనావత్ కమల ప్రారంభించారు. సర్పంచ్ గటిక సుష్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎంపీపీ హాజరయ్యారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సర్వర్, ఏపీఎం తోటకూరి కృష్ణమూర్తి, ఎస్ఎంసీ మహేశ్, ఉపసర్పంచ్ దేవేందర్, ఎంపీటీసీ మౌనిక, సుభాషిణి, వార్డు సభ్యులు గట్టయ్య, రైతుబంధు సమితి అధ్యక్షు డు ప్రభాకర్, సాంబయ్య, శ్రీను, కొమురయ్య, సోమలక్ష్మి, పద్మ, ఐకేపీ సభ్యులు సృజన, మంగమ్మ, సువర్ణ, కలమ్మ, రైతులు జీడి మల్లయ్య, హమాలీ సభ్యులు ప్రభాకర్, చంద్రబోస్, సతీశ్, ప్రసాద్, దూడయ్య, పాల్గొన్నారు.
తాజావార్తలు
- సీడీకె గ్లోబల్ వర్ట్యువల్ కన్వర్జెన్స్ -2021
- కరోనా క్రైసిస్ ఉన్నా.. స్టార్టప్‌లు భేష్!!
- బంద్ కానున్న గూగుల్ డ్యుయో సేవలు..?
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్‌ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిక