అకాలం.. ఆగమాగం

- కమ్ముకొస్తున్న ‘నివర్' ఫీవర్
- తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షం
- కల్లాల్లో ధాన్యం రాశులు
- ఆందోళనలో అన్నదాతలు
- గజగజ వణుకుతున్న జనం
- చలిమంటతో ఉపశమనం
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అకాల వర్షం ఆగమాగం చేసింది. సకాలంలో వర్షాలు కురవడంతో పాటు భూగర్భ జలాలు పెగిగాయి. దీంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. కొద్ది రోజులుగా పంటలు చేతికొస్తుండడంతో రైతులు కోత పనులు ప్రారంభించారు. నూర్పిడి చేసి విక్రయానికి సిద్ధమవుతున్న తరుణంలో నివర్ తుఫాన్ ధాన్యాన్ని నీటి పాలు చేసింది. రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షానికి కల్లా లు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కవర్లు కప్పి తడువకుండా జాగ్రత్త పడ్డారు. మరికొన్ని ప్రాంతాల్లో రాశులు తడిసిపోయాయి. ఇదిలా ఉండగా తుఫాన్ ప్రభావంతో చలితీవ్రత పెరిగింది. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఇంటి నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు. స్వెట్టర్లు ధరించి, రగ్గులు కప్పుకుని ఇంట్లోనే ఉంటున్నారు. చిన్నారులను ఇళ్ల నుంచి బయటికి పంపొద్దని, బయటికి పంపాల్సి వస్తే మంకీ క్యాప్‌లు పెట్టి పంపించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. పెద్దలు సైతం అత్యవసరమైతే తప్ప బయటికి రావడం లేదు. రోజురోజుకూ ‘నివర్' తీవ్రత పెరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం రాశులు తడవకుండా చూసుకోవాలని వ్యవసాయాధి కారులు రైతులకు హెచ్చరిస్తున్నారు.
నర్సంపేట/వర్ధన్నపేట/పరకాల/నర్సంపేట రూరల్/ చెన్నారావుపేట/శాయంపేట/రాయపర్తి/దామెర
తాజావార్తలు
- చిన్న పరిశ్రమలకు ‘ఆలీబాబా’:డిజైన్‌పై ఫోకస్!
- జలుబు చేసినప్పుడు పెరుగు తింటున్నారా..
- స్ట్రాబెర్రీస్ తినడానికి చాలా కారణాలున్నాయ్.!
- తెలంగాణ సీఐ సృజన్‌రెడ్డికి జీవన్ రక్షా అవార్డు
- రైతన్నలకు శాల్యూట్ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- ఆన్ లైన్ లో అమ్మకానికి బిడ్డ ...!
- బొలెరో వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు
- బడ్జెట్ రోజున.. పార్లమెంట్ వైపు దూసుకెళ్తాం: రైతులు
- ఈ మందు టేస్ట్ సూపర్ గురూ..!
- రజినీకాంత్ 'అన్నాత్తే' రిలీజ్ డేట్ ఫిక్స్..!